RRK MURTHY garu (ఆర్.ఆర్.కె.మూర్తి గారు) (1928-2011)
FROM TESTIMONY OF RRK MURTHY:
ఫిబ్రవరి-29 నా జన్మదిన సందర్భంలో మాసిలామణి గారిచ్చిన సందేశం మరిచిపోలేను.
పూర్తి పేరు:రాయసం రాధా కృష్ణమూర్తి
జన్మదినం:ఫిబ్రవరి-29,1928
నాన్నగారి పేరు: రంగనాయకశర్మ
అమ్మగారు:కామేశ్వరమ్మ
భార్య పేరు:వరలక్ష్మి
అన్నలు:వెంకట సుబ్బారావు,సత్యన్నారాయణ, విశ్వనాథం,కల్యాణ రామ్మూర్తి
అక్కలు:లక్ష్మీ దేవమ్మా,శకుంతల
మా వూరు గోవిందపురం.గుంటూరు జిల్లా నర్సారావు పేట తాలూకా చిలుకలూరి పేట రోడ్డు ప్రక్కగా ఉన్న కుగ్రామం.పుట్టి పెరిగింది నిష్టాగరిష్టమైన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో. చితికిపోయిన మద్యతరగతి కుటుంబం.రాయసం వారు పూర్వం రాజుల ఆస్థానంలో కవులుగా ఉండేవారు.మేం ఐదుగురు సోదరులం.మా నాన్నగారికి ఐదుగురు సోదరులు.
1955వ సంవత్సరం ఆ రాత్రి నా జీవితంలో మరుపురానిది. అంతరాంతరాలలో చెప్పశక్యం కాని వ్యధ మొదలైంది. క్రీస్తు కోసం శిబిరం వెలుపలికి వెళ్ళి నింద భరించడానికి నా ఆత్మ భయపడుతోంది. గజగజ వణికిపోయాను. నాలోని నవనాడులు కుంగిపోయాయి. పడకలో అటు ఇటూ పొర్లాడాను. అర్థరాత్రి భరించరాని శిరోవేదన మొదలైంది. అలాగే కునుకు పట్టింది. అది స్వాప్నిక అవస్థ. నాలోని మనిషితో నేనే తర్కానికి వుపక్రమించాను.
నాలో నేను :
"నువ్వు యేసుకు విద్యార్ధివి, శిష్యుడివి కావు."
"ఎందుకు కాను? జ్ఞాన సముపార్జన చాలదా."
"చాలదు. శిష్యుడు గురువు కాడిని మొయ్యాలి."
"శిష్యుడు కావాలంటే అంత వెల చెల్లించాల్సిందేనా?"
"అది నా వల్ల కాదు"
"వెల చెల్లించందే శ్రేష్టమైంది దొరకదు."
1955 సంవత్సరం సెప్టెంబర్ 26 నా ఆధ్యాత్మిక జన్మదినం. నేను నా తల్లి గర్భవాసాన పుట్టినప్పుడు పాపిని.
"బైబిలులో తప్పులు పట్టుకుందామని చదివాను.బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకున్నది."
ఈ విధంగా నేను మనసులోని మనసుతో ఎంతో రభసపడ్డాను. ఎటూ పాల్పోవటం లేదు. క్రైస్తవంలో ఆకర్షణీయమైంది ఏదీ లేదు. కానీ జాగ్రత్తగా వెతికితే బైబిలులో క్రీస్తు సాక్షాత్కరిస్తాడు! మతపు దిబ్బలో క్రీస్తును పూడ్చిపెట్టారు. అందుకే నాబోటి వారికి క్రీస్తును వెదకటం ప్రయాస అయిపోయింది. దీనికి బాధ్యులు క్రైస్తవ మతస్థులే అని నేను ఘంటా కంఠంతో చెబుతున్నాను.
మనుషులకు మతం కాదు జీవమివ్వటానికి యేసు వచ్చాడు. నేటి అణుయుగంలో మతాలన్నీ మృతకళేబరాలు. క్రీస్తు సజీవుడు.సమకాలీనుడు.మతాతీతుడు.మత ప్రమేయంలేని క్రీస్తే నాకు కావాలి.ఆయన్నే నేను ఆరాధిస్తాను. అదే ఉత్కంఠ తీవ్రంగా నాలో బయల్దేరింది. ఎలాగైతేనేం ప్రభువు కృపను బట్టి చివరికి తీర్మానం చేసుకోగలిగాను. "ఏది ఏమైనా సరే యేసూ నువ్వేనా రక్షకుడివి ప్రభువువు." అంటూ నిర్ధిష్టంగా చెప్పేసి లేచాను. ఉలిక్కిపడ్డాను. నా అనుభూతినంతా మళ్ళీ పునర్విమర్శ చేసి చూసుకున్నాను.
ఆ మరునాటి రాత్రి నా కంటిపొరలు రాలిపోయినట్టు దర్శనం కలిగింది. ప్రభువు సాక్షాత్కారం పొందాను. గలతీయులకు 2:20 నా హృదయ గుహలో మారుమోగింది. "నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి వున్నాను. ఇకను జీవించేవాణ్ణి నేను కాదు. క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు యీ శరీరంలో నేను జీవించే జీవితం నన్ను ప్రేమించి నా కోసమై తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారునియందలి విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను."
నా జీవితంలో 30 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. రెండో భాగం మా కుటుంబంలో క్రీస్తుశకం నాతోనే మొదలైందనిపిస్తోంది.
ఒకసారి మా బంధువుల్లో ఒకాయన "ఒరేయ్ హిందూమతం ఎందుకురా వదిలావు?అందులో ఏదైనా లోపం వుందనుకుంటే నీకు చేతనైతే సంస్కరించి మార్చు".దానికి జవాబు "నేను మార్చగలిగింది నాకెందుకు?నన్ను మార్చే క్రీస్తు నాకు కావాలి".
15వ తేది జులై నెల 2011వ సంవత్సరం దైవజనులు ప్రభువునందు నిద్రించారు.
What about his personal family members means sins and daughters.where they now
ReplyDeleteHis son is deva dandala
DeleteHe has one son joel studying in london and one daughter ,she is a doctor..
They both are unmarried.
Rrk murthy GARI animated vedios
Prise the lord
ReplyDeletePraise the lord
ReplyDeleteGood job
ReplyDeleteGreat Man of God, left everything for Christ.. His messages will be alive until the coming of Christ. Praise the lord.
ReplyDelete