Saint Francis Xavier life history in telugu
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్ క్సేవియర్ (1506-1552)
క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు.
బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు.
ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పాటు చేయాలని నిర్ణయమైంది. అయితే ఎన్నుకొన్న వారిలో ఒకరు అనారోగ్యానికి గురికావడంతో ఇగ్నేషియస్ సందిగ్ధంగానే క్సావియర్ ను అడిగినప్పుడు క్సేవియర్ ఒప్పుకొన్నాడు. ఈ విధంగా అనుకోకుండా మిషనరీగా వెళ్ళే అవకాశం ఫ్రాన్సిస్ క్సేవియర్ కు లభించింది.
క్సేవియర్ 1542లో మే 6న భారతదేశంలోని గోవాకు చేరుకున్నాడు.మొదటి 5నెలలు తన సమయాన్ని బోధించడానికి, హాస్పిటల్ లోని రోగులను చూసుకోవడానికి ఉపయోగించేవాడు. తరువాత వీదులలోనికి వెళ్ళి పిల్లలను, సేవకులను గంట మ్రోగించడం ద్వారా పిలిచి వారడిగే ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చేవాడు. దక్షిణ భారతదేశంలోని ప్రజలకు బోధించడానికి 3 సంవత్సరాలు అంకితం చేశాడు. అలాగే తీరం వెంబడి సుమారు 40 చర్చిలను నిర్మించాడు. ఈ సమయంలోనే భారతదేశానికి సువార్త సేవ చేయడానికి వచ్చి మరణించిన తోమా సమాదిని సందర్శించారు.
క్సేవియర్ 1552లో డిసెంబర్ 3న ప్రభువు సన్నిధికి చేరుకున్నాడు. క్సేవియర్ యొక్క మృతదేహం ఇప్పుడు గోవాలోని "బాసిలికా ఆఫ్ బామ్ జీసస్" చర్చిలో ఒక గ్లాస్ కంటైనర్ లో ఉంచబడి ఉన్నది.

we want to full story of francis xavior
ReplyDelete