George Muller (జార్జ్ ముల్లర్) (1805-1898)
జార్జ్ ముల్లర్ పూర్తి పేరు జోహన్ జార్జ్ ఫెర్డినాండ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1805లో సెప్టెంబర్ 27న జన్మించారు. తండ్రి పేరు ఫ్రెడ్రిచ్ ముల్లర్. తల్లి పేరు సోఫీ ఎలియొనోర్ ముల్లర్.
1829లో ముల్లర్ గారు లండన్ సొసైటీ ద్వారా ఇంగ్లాండ్ లోని యూదుల మద్య పరిచర్య చేయడానికి నిశ్చయించుకున్నారు. అదే సంవత్సరం మార్చి 19న లండన్ చేరుకున్నారు. మే నెల మద్య నాటికి అనారోగ్యం వచ్చి ,జీవించలేననుకున్నారు. తిరిగి తేరుకునేందుకు టెయిన్మౌత్ కు పంపబడ్డాడు. అక్కడే తన జీవితమంతా తనకు స్నేహితుడుగా ఉన్న హెన్రీ క్రైక్ తో పరిచయం ఏర్పడింది.
సెప్టెంబర్ లో లండన్ కు తిరిగి వచ్చాడు. కానీ పది రోజులకే మళ్ళీ అస్వస్థత చెందారు. నవంబర్ చివరికల్లా లండన్ సొసైటీ తనకు సరైన ప్రదేశం కాదనే సందేహం వచ్చింది. డిసెంబర్ 12 సొసైటీ నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక నెల తరువాత సొసైటీకి "దేవుడు నన్ను నడిపించిన స్థలంలో మరియు సమయంలో నేను శ్రమపడతాను." అని తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. కానీ లండన్ సొసైటీ వారు దానికి అంగీకరించలేదు. అప్పుడు లండన్ సొసైటీతో తనకున్న సంబంధం ముగింపుకొచ్చింది. తరువాత టెయిన్మౌత్ కు చేరుకున్నాడు. చాలా సార్లు హెన్రీ క్రైక్ కొరకు ప్రసంగాలు ఇచ్చాడు. 1830లో అక్టోబర్ 7న మేరీ గ్రోవ్స్ తో వివాహం జరిగింది. 1832లో మే 25న బ్రిస్టల్ కు చేరుకున్నాడు. మిగిలిన పరిచర్యలు చేస్తునే హెన్రీ క్రైక్ తో పాటు బ్రిస్టల్ లో బోదించేవాడు.
ముల్లర్ పరిచర్య తల్లిదండ్రులు లేని పిల్లలు మద్య 1836లో 30 మంది ఆడపిల్లలకు వసతి ఏర్పాటు చేయడంతో ప్రారంభమైంది. తరువాతి కాలంలో పిల్లల సంఖ్య పెరిగి చుట్టుపక్కల వాళ్ళు పిర్యాదు చేయడంతో ప్రత్యేకమైన పెద్ద గృహాలలో పిల్లలకు వసతి ఏర్పాటు చేశాడు.
జార్జ్ ముల్లర్ గారి అనాధ ఆశ్రమంలో ఒకరోజు వంటవాడు ఈరాత్రి పిల్లలకు పెట్టడానికి ఏమి లేదని చెప్పాడు. సరే అని చెప్పి ప్రార్ధించడం ప్రారంభించారు ముల్లర్ గారు. రాత్రి 7 గంటలు అయ్యింది. వార్డెన్ వచ్చాడు. అయ్యగారు ఏమి చెయ్యమంటారు? పిల్లలను ప్లేట్స్ పట్టుకొని డైనింగ్ హాల్ లో కూర్చోమని చెప్పండి. ముల్లర్ గారి మాటలకు వంటవాడు, వార్డెన్ ఆశ్చర్యపోయారు ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకొని, ఆయన చెప్పినట్లే చేసారు. ఈలోపు ఒక పెద్ద లారి ఆశ్రమంలోనికి ప్రవేశించింది. వాళ్ళు ఇలా చెప్తున్నారు. అయ్యగారు ఈ రోజు పట్టణంలో ఒక పెద్ద సభ ఏర్పాటు చెయ్యబడింది. హటాత్తుగా పిలువబడిన ముఖ్య అతిధులలో ఒకరు చనిపోయారు. మీటింగ్ రద్దు చేసారు.సిద్ధ పరచిన ఆహార పదార్ధాలు మీ ఆశ్రమానికి అందజేయమన్నారు. ఆహార పదార్ధాలు లారీ నుండి దించుతూ వుండగానే, వెలుపల పాలు తీసుకెళ్తున్న లారి పంచర్ అయ్యింది. ఆ లారీ డ్రైవర్ ఆ విషయాన్ని వాళ్ళ బాస్ కి చెప్తున్నాడు. అవతల నుండి వాళ్ళ బాస్ 'నీవెక్కడున్నావ్?' అని అడిగితే ముల్లర్ గారి ఆశ్రమం దగ్గర అని సమాధానమిచ్చాడు. వాళ్ళ బాస్ "అయితే, ఆ మిల్క్ ప్యాకెట్స్ ఆశ్రమంలో ఇచ్చేసి, లారి ప్రక్కన పెట్టు."అని చెప్పాడు. ఆ ప్యాకెట్స్ 15 రోజుల వరకు పిల్లలకు సరిపోయాయి.
ముల్లర్ గారు స్థాపించిన 117 పాఠశాలల్లో 1,20,000మందికి పైగా పిల్లలు క్రైస్తవ విద్యను అభ్యసిస్తున్నారు.వారిలో చాలా మంది అనాథలే.
జార్జ్ ముల్లర్ గారు 1898లో మార్చి 10న ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.
Glory to Jesus amen
ReplyDeleteనా దేవుడు సమర్ధుడు
ReplyDelete