Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పా

John Wesley life history in telugu

John Wesley (జాన్ వెస్లీ) (1703-1791)

   "లోకమే నా సేవ స్థలం" అను నినాదం తో క్రీస్తు సువార్తను అనేక దేశాలలో వెదజల్లి అనేక ఆత్మలను క్రీస్తు వైపునకు త్రిప్పి గొప్ప ఉజ్జివాన్ని తీసుకువచ్చిన జాన్ వెస్లీ గారి సేవా జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.

  జాన్ వెస్లీ ఇంగ్లాండులో జన్మించిన ఒక గొప్ప దైవసేవకుడు.
      ఇతని పుట్టిన రోజు 17 జూన్ 1703. ఇతని తండ్రి పేరు శామ్యూల్ వెస్లీ , తల్లి పేరు సూసన్నా వెస్లీ.ఈ దంపతులకు 19 మంది సంతానం. ఆ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికిరి.
     వారిలో జాన్ వెస్లీ  ఒకడు . అప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం జరిగినది. ఈ ప్రమాదంలో వెస్లీ కూడా మరణించాల్సినవాడే. కానీ దేవుడు అతని యెడల గొప్ప ఉద్దేశ్యాలను కలిగియున్నాడు. కనుక ఆయన తన కృపనుబట్టి అతన్ని కాపాడెను. ఈ అగ్ని ప్రమాదం సంభవించినపుడు జాన్ వెస్లీ వయస్సు ఆరు సంవత్సరాలు .

       వెస్లీ యొక్క తండ్రి ఒక బోధకుడైయుండెను. తల్లి సూసన్నా వెస్లీ తన బిడ్డలనందరిని వారి చిన్న ప్రాయము నుండే దేవుని భయభక్తుల్లో  పెంచింది.
    వెస్లీ తన 15వ ఏటనే విశ్వవిద్యాలయంలో చేరాడు. తన 23 వ  సంవత్సరమున యం.ఎ. ముగించాడు. అదే సమయంలో అతడు లాటిన్, గ్రీకు, హెబ్రూ, ఫ్రెంచి మొదలగు భాషలను కూడా నేర్చుకున్నాడు. తల్లిదండ్రులు ఇతన్ని దేవుని సేవకు సమర్పించారు.
     వ్యక్తిగతంగా తాను ఎటువంటి అపవిత్రమైన కార్యము చేయటం లేదు కనుక వెస్లీగారు తాను పరిశుద్ధుడననే అభిప్రాయము అతనికుండెను. తన తండ్రి పాస్టరుగారు అయినందున తాను కూడా సేవలో కొనసాగాలని జాన్ వెస్లీ తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు.

        రోజుకు రెండుసార్లు బైబిలు చదవడం, ఆదివారం గుడికి వెళ్ళడమే భక్తి అనుకున్నాడు. శరీర సంబంధమైన ఎలాంటి పాపక్రియలు చేయనందున తాను పరిశుద్ధుడననే భావించాడు. కాని అతనిలో  గర్వము, అవిశ్వాసము గూడుకట్టుకొనిపోయాయి. అతనిలో ఉన్న ఈ లక్షణాలు తాను రక్షింపబడుటకు అడ్డుగా ఉన్నాయని వెస్లీ గ్రహించలేకపోయాడు.
      ఒక దైవసేవకుడు వ్రాసిన పుస్తకాన్ని వెస్లీ చదవడం జరిగింది. అప్పటి నుండి అతను తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. కానీ ఇంకా లోతైన రక్షణానుభవము పొందని వాడుగానే ఉండెను. ఒక సారి జాన్ వెస్లీ గారు ఓడ ప్రయాణం ద్వారా అమెరికాకు వెళ్ళుచుండెను . ఆ ఓడ లో పీటర్ అను వ్యక్తి వెస్లీ కి పరిచయమయ్యాడు. "నీవు రక్షింపబడ్డవా?" అని పీటర్ గారు వెస్లీ ని అడిగారు . ఈ ప్రశ్నకు వెస్లీ ఆశ్చర్యపోయాడు. "నేను నా చిన్నతనం నుండి పరిశుద్ధంగా ఉన్నాను,దేవుని సేవకు కూడా సమర్పించుకున్నాను" అని అన్నాడు. క్రీస్తు నందు విశ్వసించుట ద్వారానే వ్యక్తిగతంగా రక్షించబడతాము, కానీ మంచిగా బ్రతుకుట వలన రక్షణ రాదని పీటర్ చెప్పాడు.

     క్రీస్తు లోకరక్షకుడని ఎరుగుట కాదు, కానీ యేసుక్రీస్తు నీ రక్షకుడైనాడా? అని అతడు మరో ప్రశ్నను సంధించాడు. ఈ ప్రశ్న వెస్లీని ఎంతగానో కదిలించింది. సేవ కొరకు నేను అమెరికాకు వెళ్తున్నాను, అయ్యో! నన్ను ఎవరు రక్షించగలరు? విశ్వాసము లేని నా దుష్ట హృదయము నుండి ఎవరు నన్ను విడిపించగలరు? అని పశ్చాత్తాప్తుడైనాడు . ఆ సమయంలోనే లోతైన రక్షణానుభవము పొందాడు.
    నిజమైన రక్షణానుభవము ఇతడు 24 మే 1738లో పొందాడు. అతడు ఓడలో అమెరికాకు బయలుదేరిన తేది 18 అక్టోబర్ 1735.
  ఇతడు ప్రార్థనలో  అధిక సమయం గడిపేవాడు. అంతేగాక దేవుడు అతని సేవ కూడా ఆశిర్వదించడం ప్రారంభించాడు. తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచి ప్రార్ధించేవాడు . ఇతని  ప్రసంగం విని అనేకులు పశ్చాత్తాపంతో ప్రభువుతట్టు తిరుగుచుండిరి.
  లండన్ లో ఒకసారి వీధిలో  ఇతడు ముడుగంటల సేపు వర్షంలో తడుస్తూ ప్రసంగించాడు. అక్కడున్న ప్రజలు కూడా వర్షంలో తడుస్తూనే  దేవుని మాటలు ఆసక్తితో విన్నారు. అనేకులు పశ్చాత్తాపడ్డారు. జాన్ వెస్లీ గారు పశ్చాత్తాపము, మారుమనస్సు, పాపక్షమాపనను గూర్చే నొక్కి చెప్పుచుండేవాడు. ఇతని బోధ కొందరికి ఇష్టంగా లేనందున అతన్ని తమ సంఘాలకు ఆహ్వానించలేదు. అయిననూ వీధులలో గుర్రం పై ప్రయాణిస్తూ సువార్తను ప్రకటించేవారు. అనేకులు పశ్చాత్తాపపడి పరివర్తన చెందుతుండిరి.

     వెస్లీ క్రమశిక్షణ గలవాడు. ఇతని పరిచర్యను దేవుడు వర్ధిల్లజేయుచున్నాడు. ఇతడు బోధిస్తే  ఇతని సోదరుడైన చార్లెస్ వెస్లీ గారు మధురమైన పాటలు పాడేవారు. సేవలో వీరిద్దరి కలయిక వలన ఎన్నో ఆత్మలు రక్షింపబడుతూ ఉండెను.

          వెస్లీగారు "లోకమే నా సేవాస్థలము" అని అనుచుండేవారు. అనేక స్థలాలకు ప్రయణం చేస్తూ రాత్రింబగళ్ళు బోధిస్తూ ఉండేవారు. ఇతని ప్రసంగం వాక్యాలు బాణములవలే మనుష్యులహృదయాలలో దూరుచూ ప్రజలు  రక్షింపబడుటకు కారణమయ్యేవి.
    ఇతను చాల కఠినముగా కనబడువాడు కానీ ఇతనిలోని సహనము, ధీనత్వము, క్రీస్తు కొరకు అనేకులను సంపాదించుటకు సహాయపడెను. ఐర్లాండు, అమెరికా, కెనడా మొదలగు దేశాలలో కూడా సేవను ప్రారంభించాడు.ఇతను మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. ఇతడు ఏ పని చేసిన ప్రార్ధన ద్వారా దేవుని పై ఆధారపడేవాడు. అందువలనే కఠిన హృదయములు కల్గిన వారు కూడా రక్షింపబడేవారు.

   జాన్ వెస్లీగారు తాను 40 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు సువార్త సేవ కొరకు రోజుకు 20 మైళ్ళు ప్రయాణించేవారు. ఇతడు సంవత్సరానికి 5000 సార్లు ప్రసగించాడు. సువార్త సేవకై ఇతడు 30,000 డాలర్లు తన సొంత ధన నిధి నుండి వాడెను.
           "ప్రభువా నీ కొరకు కాలిపోనీ గాని తుప్పుపట్టనివొద్దు, నిష్ప్రయోజనమైన జీవితం జీవింపనియ్యవద్దు" అని తరచుగా ప్రార్ధించేవాడు. తన వృద్దాప్యంలో కూడా 15 గంటలకంటే ఎక్కువ వ్రాయలేకపోతినే రెండుసార్ల కంటే ఎక్కువ ప్రసంగములు చేయలేకపోతినే, ఉదయం 5.30 గంటలవరకు పడుకోవాలని ఆశ కలుగుతుందే అని చింతిస్తూ సిగ్గుపడేవాడు.
       జాన్ వెస్లీగారు రష్యాలో సేవచేస్తుండగా తీవ్రమైన జ్వరంతో మంచం పట్టాడు. ఆ జ్వరంతోనే 2 మార్చి 1791 నాడు ప్రభువు నందు నిద్రించాడు. అప్పటికి అతని వయ్యసు 88 సంవత్సరాలు , "దేవుడు మనకు తోడుగా ఉన్నాడు" అన్నది ఇతని చివరి మాటలు.

     జాన్ వెస్లీ గారి జీవితం మన అందరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని భావిస్తూ ఈ విషయాలు మీకు తెలియజేయడమైనది.

Comments

  1. Plz దయచేసి మొత్తం చరిత్రను పెట్టండి, ప్రతీ దైవసేవకుని గురించి తెలుసుకోవడం మాకు మంచిది కాబట్టి దయచేసి మొత్తం స్టోరీని పెట్టండి.

    ReplyDelete
  2. Thank you for wonderful history of a man of God.. Glory to god

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

George Muller life history in telugu