Thomas Bilney (థామస్ బిల్నీ) (1495-1531)
సహోదరుడు థామస్ బిల్నీ ఒక ఆంగ్ల క్రైస్తవ హతసాక్షి. బిల్నీ నార్ఫోక్ లో 1495 లో జన్మించెను. 1510 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రవేశించెను. అతనికి ఉన్న పొట్టితనాన్ని బట్టి లిటిల్ బిల్నీ అని పిలిచే వారు.1519 లో L.L.B కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు పూర్తి చేసెను. ఈ అకాడమీ విద్యల వలన తృప్తి లేనటువంటి బిల్నీ తన దృష్టిని గ్రీకు భాషలో ఉన్న క్రొత్త నిబంధన వైపు మరల్చినాడు.
అలా బిల్నీ క్రొత్త నిబంధన చదువుతునపుడు 1 తిమోతి 1:15 (పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది.) అనే వాక్యము చేత సందించబడ్డాడు.తరువాత ఈ వాక్యము తేనె కంటే ఇష్టమైనది అని బిల్నీ చెప్పెను. బిల్నీ కీ ఈ వాక్యం అన్నిటికంటే ముఖ్యమైనది గాను ఇష్టమైనది గాను ఉన్నది.
తన స్నేహితులలో పార్కర్, లాటిమర్,కాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్ ప్రధానమైన వారు. లాటిమర్ మరియు బిల్నీ ల మధ్య మంచి స్నేహం ఏర్పడెను.బిల్నీ యొక్క రక్షణను చూసి లాటిమర్ ఈ రీతిగా చెప్పెను ""నేను దీనిని 20 సంవత్సరాల క్రితమే తెలుసుకొంటిని అని"".
దేవుని వలన బలము పొందిన బిల్నీ అపోస్తులల వలె బోధించెను.జనులు పాపములు ఒప్పుకొని వాటిని ద్వేషించి నీతి కొరకు ఆకలిదప్పులు గలిగి క్రీస్తు యొద్ద నీతిని పొందవలెనని ప్రజలకు నేర్పించెను. క్రైస్తవ సంఘములోనికి విగ్రహారాధన తేకుండా ఉంటే యూదులు,అన్యజనులు ఎప్పుడో క్రీస్తు దగ్గరకి వచ్చే వారని బోధించెను.
ఈ మాటలు అప్పటి పెద్దలు ఓర్చుకోలేకపోయిరి.బిల్నీని ప్రసంగ పీఠము నుండి క్రిందికి లాగి వేసి వెల్లగొట్టిరి.అయినను బిల్నీ మైదానాలలో బహిరంగంగా క్రీస్తును ప్రకటించెను.చివరకు ఆయనను అరెస్టు చేసి 1528 లో లండన్ తీసుకుపోయిరి.
బిల్నీ చెరసాలలో ఉన్నపుడు ఆర్థర్ విశ్వాసులు గుంపులను దర్శించి బలపరుచుచు ఉండెను.ఇలా చేస్తూ సువార్త ప్రకటిస్తునందున ఆర్థర్ ని కూడా చెరసాల లో వేసిరి. ఇద్దరిని న్యాయస్థానం ముందుకు తీసుకు వచ్చిన దినము వచ్చెను. ఇద్దరిని మీరు చేసిన బోధ తప్పు అని ఒప్పుకోమని మీ పడ్డారు మార్చుకోమని కొంత సమయం ఇచ్చెను.వారికి ఏమి జరుగును అని అందరూ కలవరపడుచు ఉండెను.
బిల్నీ స్నేహితులు అతనిని దర్శించి అతనిని మరణించకుండా ఉండుటకు అనేక కారణములు చూపిరి. బిల్నీ ఈ యొక్క మాటలు వలన నేను క్రీస్తు సువార్త గురించి నా ప్రాణమును కాపాడుకొందును అని తీర్మానానికి వచ్చెను.ఇది దేవునికి వ్యతిరేకంగా ఉండెను.ఇక బిల్నీ యొక్క విశ్వాసము తగ్గిపోయెను.ఆత్మ దృష్టి మందము ఆయెను.పరిశుద్ధాత్మ అతనిని వదిలిపెట్టెను.బిల్నీ దేవుని సన్నిధి పోగొట్టుకొని ఎంతో దౌర్భాగ్య స్ధితిలో ఉండెను.
చెర నుండి బయటకు వచ్చిన తరువాత బిల్నీ ఎంతో బాధపడెను. పోపు అనుచరులు అతనిని పరిహసించెను.విలియం టీండిల్ యొక్క సహవాసము బిల్నీ వెతికేను.బిల్నీ భోజనము చేయక దేవునిని పోగొట్టుకొనినందుకు ఎంతో బాధలో ఉండెను.అప్పుడు అతనికి పరలోక దర్శనము కలిగెను.ఈ పడిపోయిన శిష్యుని హృదయములో వెలుగు కలిగెను.అయినను బిల్నీ తన తప్పు అతని దృష్టికి నీచంగా ఉండెను.దేవుడు ఎంత ఓదార్చినను తిరిగి మరల మరల ప్రభువును క్షమించమని అనేక మార్లు కన్నీరు కారుస్తూ వేడుకొనెను.
ఇక బిల్నీ ఒకే ఒక తలంపుతో ఉండెను.ప్రభు కొరకు మరణించుటకు కూడా సిద్ధపడెను.తిరిగి బలంగా సువార్త ప్రకటించెను. ఇంతకు ముందు ఆ మరణ శిక్షలోని అగ్ని ఇప్పుడు అతనికి ప్రీతిగా మారెను.
చివరికి అగ్నితో బిల్నీని కాల్చి వేసిరి.
ప్రభువు కొరకు హతసాక్షిగా మారెను.
Comments
Post a Comment