Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Eric henry Liddell life history in telugu

Eric Henry Liddell (ఎరిక్ హెన్రీ లిడ్డెల్) (1902-1945)
   ఎరిక్ 1902లో జనవరి 16న స్కాటిష్ తల్లిదండ్రులకు చైనాలో జన్మించాడు.
  1924లో పారిస్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో  పాల్గొన్నాడు. దేవునికి ఇచ్చిన మాట కోసం ఆదివారం పాల్గొనాల్సిన 100మీటర్ల పరుగు పందెంలో పోటిపడకుండా చర్చికి వెళ్ళాడు.దేవుని కృప చేత స్కాట్లాండ్ అభ్యర్థన మేరకు తనకు అనుభవం లేని 400మీటర్ల పరుగు పందెంలో పోటిపడి బంగారు పతకం సాధించాడు.ఈ పరుగు పందెంలో 47.6సెకన్ల తక్కువ సమయంలో పరుగెత్తి చరిత్రలో క్రొత్త రికార్డు సృష్టించాడు.

"ఫ్లైయింగ్ స్కాట్లాండ్" అనే బిరుదు పొందాడు. అతని జీవితం ఆధారంగా రూపొందించిన చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా ఆస్కార్ అవార్డు గెలిచింది.

    ఒలింపిక్ లో  బంగారు పతకం సాదించినందుకు ఏర్పాటు చేసిన సభ నుండి నేరుగా చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు.ధనవంతులైన చైనా విద్యార్థులు చదువుకొనే ఆంగ్లో చైనీస్ కాలెజ్ లో అద్యాపకునిగా తన మిషనరీ పని ప్రారంభమైంది.

ఎరిక్ వివాహం 1934లో "ఫ్లోరెన్స్ మెకెంజీ"తో జరిగింది.
1941లో చైనాలో జీవనం జపాన్ దాడుల వల్ల దారుణంగా తయారైంది. ఫ్లోరెన్స్ తన పిల్లలతో పాటు కెనడా కు చేరుకుంది.కానీ దేవుని పని నిమిత్తం ఎరిక్ చైనాలోనే తన పరిచర్య కొనసాగించాడు.

   ఎరిక్ చనిపోయిన రోజు తన భార్యకు వ్రాసిన ఉత్తరంలో "నెర్వస్ బ్రేక్ డౌన్"తో బాదపడుతున్నట్లుగా తెలిపాడు. ఎరిక్ 1945వ సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రభువు సన్నిధికి చేరాడు.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu