*ఫెన్నీ క్రాస్బీ (1820-1915)*
ఫెన్నీ క్రాస్బీ న్యూయార్క్ పట్టణం ఆమెరికాలో మార్చి 24వ తేదీన జన్మించింది. 6 వారాల పసికందుగా ఉన్నప్పుడు ఆమెకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు వైద్యుని నిర్లక్ష్యాన్ని బట్టి తప్పైన మందును తన కళ్ళళ్ళో వేసినందుకు ఆమె చూపును కోల్పోయింది. 8 నెలల బిడ్డగా ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. 14 సం" వయస్సులో ఆమెను అంధుల పాఠశాలలో చేర్పించారు.
ఫెన్నీ క్రాస్బీ తనకున్న లోపాన్నిబట్టి, తనకున్న కష్టాలనుబట్టి కృంగిపోక, నిరాశచెందక దేవుని స్తుతిస్తూ దేవునియందు ఆనందించేది. దేవుడు ఆమెకు అనుగ్రహించిన సంగీతం, కవిత్వం వంటి తలాంతులు ద్వారా చక్కటి పదజాలంతో దేవుని స్తుతి కీర్తనలు వ్రాసింది.
డి.యల్.మూడీ వంటి గొప్ప దైవజనుల సభలలో కూడా ఆమె దేవుని స్తుతి కీర్తనలు పాడేది. ఆమె పాడే పాటల ద్వారా అనేకుల హృదయాలు స్పందించేవి. ఆమె.ఇంచుమించు 9,000 కీర్తనలు వ్రాసినట్టుగా అంచనా వేశారు. అనేక భాషలలో ఆ పాటలు తర్జుమా చేశారు, అనేక దేశాల్లో ఆమె వ్రాసిన పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. ఆమె ఎంతో మందికి ఆశీర్వాదకరముగా జీవించింది.
ఫెన్నీ క్రాస్బీ అక్కడితో సంతృప్తి చెందక మురికివాడల్లోనికి, పేద ప్రజల దగ్గరకు, చెరసాలలో ఉన్న వారియొద్దకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించేది. దేవుని వాక్యమును తన హృదయములో ఉంచుకున్నందున ఆమె ప్రసంగాలు ఎంతో సారవంతముగా, అనేకులు రక్షించబడుటకు ఉపయోగకరముగా ఉండేవి. ఆమె ఫిబ్రవరి 12, 1915 ప్రభువునందు నిద్రించింది.
ఒకసారి ఫెన్నీ క్రాస్బీ ని కొందరు విలేకరులు ఈ రీతిగా ప్రశ్నించారు.
ప్రశ్న : మీ కను దృష్టిని కోల్పయినందుకు, దానికి కారణమైన ఆ వైద్యునిపై మీకు కోపము లేదా ???
మీకున్న అంధత్వాన్ని బట్టి మీరు ఎప్పుడూ విచారించలేదా ???
జవాబు : నేను ఈ లోకంలో ఏ మనిషిని చూడలేదు, నేను ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ నా కనులతో నా కొరకు ప్రాణం పెట్టిన నా రక్షకుడైన క్రీస్తునే మొట్టమొదటిసారిగా చూస్తాను. ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు కలుగజేసిన ఆ వైద్యునిపై నాకెందుకు కోపం. దేవుడు అంధత్వాన్ని నాకొక గొప్ప వరంగా అనుగ్రహించినప్పుడు నేనెందుకు విచారించాలి.
ప్రియ సహోదరా/సహోదరీ,
చిన్నప్పుడే తన దృష్టిని కోల్పోయినప్పటికి ఫెన్నీ క్రాస్బీ యేసుక్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించుకున్నది. అనేకులకు ఆశీర్వాదకరముగా మారింది, దేవుని చేతిలో ఒక ఘనమైన పాత్రగా ఉపయోగించబడింది.
ప్రియమైన యౌవనస్థులారా, ఒక అంధురాలిని దేవుడు అంతగా తన మహిమకొరకు వాడుకున్నప్పడు మరి ఏ శరీర లోపములేని నిన్ను ఎంతగా తన మహిమకొరకు వాడుకొనగలడో ఆలోచించు, నీ జీవితాన్ని సంపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువుకు అప్పగించుకో....
అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించు....
*"యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయైయుండును." 2తిమోతికి 2:21*
దేవునికి సంపూర్ణముగా అప్పగించుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా జీవించే ధన్యత ప్రభువు మనకనుగ్రహించును గాక, ఆమేన్...!!!
Glory to god
ReplyDeleteAmen..... praise the lord
ReplyDeleteJesus is great fanny Crosby life laga na life and all youth life cheyunu gaka Amen
ReplyDeleteyour faith is extraordinary mam
ReplyDeletePraise God 🙌🙌🙌🙌
ReplyDelete