Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పా

Gladys May Aylward life history in telugu


Gladys May Aylward (గ్లాడిస్ మే ఐల్వార్డ్) (1902-1970)
      గ్లాడిస్ 1902వ  సంవత్సరం ఫిబ్రవరి 24న ఎడ్మోన్టన్ లో నార్త్ లండన్ లో  జన్మించింది. ఆమె తండ్రి పేరు థామస్ జాన్ మరియు ఆమె తల్లి పేరు రొసినా ఫ్లోరెన్స్. ఆమె తోబుట్టువులు లారెన్స్ మరియు వైలెట్.
   మొదట్లో గ్లాడిస్ స్వదేశంలోనే పనిచేసింది.ఆ తరువాత క్రైస్తవ మిషనరీగా వేరే దేశం వెళ్ళడానికి దేవుడు పిలచిన పిలుపును గ్రహించింది. ఆమెను "చైనా ఇన్లాండ్ మిషన్" 3 నెలల ప్రాథమిక శిక్షణకు అంగీకరించింది.కానీ తరువాత చైనా భాషలో ప్రావీణ్యురాలు కాలేకపోవడం వలన మిగిలిన శిక్షణను ఇవ్వలేదు.
     1932లో "సర్ ఫ్రాన్సిస్ ఎంగస్బండ్" కొరకు పనిచేసి తన పొదుపు చేసిన మొత్తాన్ని చైనాలోని "యాంగ్ చెంగ్"కు  ప్రయాణమవ్వడానికి ఖర్చు పెట్టింది.ఈ ప్రయాణంలోని ఎదురైనా అడ్డంకులను దాటి "యాంగ్ చెంగ్"కు చేరింది.
       "యాంగ్ చెంగ్" చేరిన తరువాత గ్లాడిస్ అంతకు ముందునుంచి అక్కడ మిషనరీగా పనిచేసే "జీనీ లాసన్"తో కలిసి ప్రయాణికులకు ఆతిథ్యమిస్తు మరోవైపు  యేసుక్రీస్తు సువార్త ప్రకటించింది.
    చైనా ప్రభుత్వానికి "ఫుట్ ఇన్స్ పెక్టర్"గా సేవలందించింది. ఈ పనిలో భాగంగా "ఫుట్ బైండింగ్"అనే ఆచారానికి వ్యతిరేఖంగా వచ్చిన కొత్త చట్టం అమలుకు పనిచేసింది.ఈ ఆచారం వల్ల చైనీస్ ఆడపిల్లలు సరిగా నడవలేకపోవడంతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చేవి.కష్టంతో కూడిన ఆ పనిలో విజయం సాధించింది.
   1936లో చైనీస్ పౌరురాలుగా గుర్తింపు పొందింది.అనాధ పిల్లలును చేరదీసి వారిని పోషిస్తూ దేవుని జ్ఞానాన్ని అందించేది.1938లో జపాన్ సైన్యం చైనాపై దాడి చేసింది. ఆ సమయంలో వందమంది అనాధ పిల్లలను వారి నుండి తప్పించి గాయపడినప్పటికి పర్వతాలు గుండా ప్రయాణం చేస్తూ క్షేమమైన ప్రాంతంలోకి చేర్చింది.


    ఆమె "గ్లాడిస్ ఐల్వార్డ్ అనాధాశ్రమం" తైవాన్ లో  స్థాపించింది.ఆమె చనిపోయేంత వరకు ఇక్కడే పనిచేసింది.

 ఆమె చివరి వరకు వివాహం చేసుకోకుండా క్రీస్తు కొరకు చైనా ప్రజల మధ్య పనిచేసింది.గ్లాడిస్ 1970లో జనవరి 3న ప్రభువు సన్నిధికి చేరుకున్నది.ఆమె జీవితం ఆధారంగా "ది ఇన్ ఆఫ్ సిక్స్త్ హ్యాపినెస్"అనే చిత్రం చిత్రీకరించబడింది.ఆమె "స్మాల్ ఉమన్ విత్ గ్రేట్ గాడ్"గా ప్రసిద్ది చెందింది.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu