Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Purushottam chowdary gaari life history in telugu


Purushottam chowdary (పురుషొత్తం చౌదరి) (1803 – 1890)

ఆంధ్రక్రైస్తవ సంకీర్తనా పితామహుడు, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడు అని పిలువబడే కవిశేఖరుడు చౌధరి పురుషోత్తం గారి పేరు వినని, ఆయన పాట గానం చేయని  తెలుగు క్రైస్తవుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. చౌధరి పురుషొత్తం గారు 1803 సెప్టెంబరు 5 వ తేదీన గంజాం జిల్లా మదనాపుర గ్రామంలో జన్మించారు. తల్లి దండ్రులు కూర్మనాథ చౌధరి, సుభద్రా దేవి చౌధ రాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాలు నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. తమ మతాచారాల ప్రకారం పురుషోత్తమ చౌధరి గారికి ఏడు సంవత్సరాలప్పుడే ఉపనయనం (ceremony of sacred thread) జరిపి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు.

పురుషోత్తం చౌధరి గారు బాల్యం నుండే మతనిష్ట కలిగి ఉండేవారు. నిరంతర విగ్రహారాధన, తీర్థయాత్రలతో పాటు భుజాలపై వైష్ణవ మతసూచకాలైన శంఖుచక్రాల్ని కూడ  కాల్పించుకొన్నారు. 1823 లో తన మేనమామ కుమార్తె యైన రాధామణి దేవిని వివాహం చేసికొన్నారు.  సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి, 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయనారంభించాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు చాలా హిందూ మత సంబంధిత  భక్తి రచనల్ని చేశారు.

ఆయన తన అన్న గారి పాఠశాలలో పనిచేస్తుండే వారు. అప్పుడే క్రైస్తవ్యం పట్ల ఆసక్తి కలిగి, దాని గురించి తెలిసికోవాలనే తపనతో అన్వేషించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆధునిక ప్రేషిత పితామహుడు ( Father of modern missions ) గా పేరుగాంచిన విలియమ్ కేరీ తెలుగులో వ్రాసిన కరపత్రం ( Tract) ఒకటి పురుషోత్తం గారి చేతికి దొరికింది. అది చదివిన పురుషోత్తం గారికి క్రీస్తుని గురించి మరియెక్కువగా తెలిసికోవాలనిపించింది. దైవ సంకల్పం ప్రకారం మిషనరీ హెలెన్ నాట్ గారు, విలియమ్ డాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం కలిగటం, అప్పటికే రెవ. ప్రిచెట్ (1818)  తెలుగులో అనువదించిన నూతన నిబంధన తన చేతికందటంతో ఆయన ఆశ నెరవేరింది. పురుషోత్తం చౌధరి గారు దాన్ని బాగా చదివారు. వాక్య పఠనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయల్పరిచిన విషయాలు తనలో విశ్వాసాన్ని కలిగించాయి. తను అంతవరకు అవలంబిస్తున్న మతాచారాలు, విగ్రహారాధన, తీర్థయాత్రలు అన్నీ తప్పని గ్రహించి, 1833 అక్టోబరు 6 వ తేదీన క్రీస్తుని అనుసరించాలని నిర్ణయించుకొన్నాడు. అదే రోజు తన తోటి క్రైస్తవులతో కలిసి ఆరాధిస్తూ

“మా యేసుక్రీస్తుని – మరుగు గల్గెనురా

నా యాత్మ ఘన రక్ష – నగము నెక్కెనురా”

అనే కీర్తనను పాడారు. ఇది  తెలుగులో వెలువడిన మొట్టమొదటి క్రైస్తవ గీతం.

పురుషోత్తం చౌధరి గారు క్రైస్తవుడవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి ఎంతో వ్యతిరేకతను, మరెన్నో అవరోధాలను ఎదుర్కోవలసి వచ్చింది. కాని ఈ శోధనలన్నీ తనలో నిరాశను కలిగించడానికి బదులుగా తాను పొందిన రక్షణానుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే తృష్ణ ను పెంచాయి. 1836 ఏప్రిల్ 3 వ తేదీన ఆయన భార్య రాధామణి దేవి చౌధరాణి కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఆ సంవత్సరమే చౌధరి గారిని మిషనరీగా అభిషేకించారు. అనేక శ్రమలకు, తిరస్కారాలకు గురైనప్పటికీ, విశ్వాసంలో వెనుకడుగు వేయక, వేలకొలది మైళ్ళు కాలినడకను ప్రయాణించి, ఆంధ్రదేశంలో అధికభాగం పర్యటిస్తూ విస్తృత సేవ చేసి, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడయ్యాడు.

చౌధరి గారు మొత్తం 130 ఆణిముత్యాల్లాంటి భక్తి గీతాల్ని వ్రాసి క్రైస్తవలోకానికి కానుకగా ఇచ్చారు. ఈ పాటలన్నీ కేవలం భక్తిపూరితమైనవే కాదుగాని, సాహితీ సంపదతో తొణికిసలాడుతుంటాయి.

కేవలం కీర్తనల్ని మాత్రమే గాక ” క్రైస్తవ నీతి ప్రకాశం, సత్య వేద సార సంగ్రహం, “కులాచార పరీక్ష” ఇత్యాది ఎన్నో గ్రంథాల్ని కూడా రచించారు. ఆయన రచనల్లో ఎక్కువగా విగ్రహారాధనని ఖండించారు. ఆయన వ్రాసిన ప్రతి పాట స్వీయ జీవితానుభవ  లోతుల్లో నుండి పెల్లుబికినదే. అందుకే అవి ఈ నాటికీ తెలుగు క్రైస్తవ సాహిత్యంలో సజీవ సంకీర్తనలుగా నిలిచిపోయాయి. 1882 లో కనుచూపు పూర్తిగా మందగించిన సమయంలో తన కుమార్తెను పిలిపించుకొని, “సకలేంద్రియములారా – చాలు మీ పనిదీరె” అనే పాటను పాడి, ఆమెచే వ్రాయించారు. చివరకు 1890, ఆగస్టు 26 న తన 87 వ యేట ప్రభువుని  చేరుకొన్నారు.

పురుషోత్తమ చౌధరి గారి జీవితంపై, ఆయన వ్రాసిన పాటలపై, ఆ పాటలలోని సంగీత సాహిత్యాలపై  పరిశోధనలు కూడా వెలువడ్డాయి. ఈ కవి వ్రాసి గానం చేసిన కీర్తనలన్నీ వేటికవే సాటి. అన్నీ పరిశోధనార్హములే. వాటిలో కొన్ని,

మంగళమే యేసునకు – మనుజావతారునకు

దాసుల ప్రార్థన దప్పక యొసగెడు

నన్ను గన్నయ్య రావె నా యేసు – నన్ను గన్నయ్య రావె నా ప్రభువా

త్రాహిమాం క్రీస్తునాథ – దయ జూడ రావే

యెహోవ నా మొర లాలించెను

ఉన్నపాటున వచ్చు – చున్నాను నీ పాద – సన్నిధికోరక్షకా

రారె మనయేసు స్వామిని – జూతము కోర్కెలూర

యేసు నామమే పావనము, మాకు – యేసే గదా నిత్య జీవనం

“పైనమై యున్నానయ్యా” అనే పాట  చౌధరి గారి చివరి కీర్తన.

ఈ పాటలన్నీ మనకు దైవారాధనలో ఉపకరించడమే కాదుగాని, పురుషోత్తమ చౌధరిగారిని చిరస్మరణీయుణ్ణి చేశాయి. ఈ మహనీయుడి జీవితం, పాటలు, తెలుగు క్రైస్తవలోకానికి దేవుడనుగ్రహించిన బహుమానంగా భావించవచ్చు.

Comments

Post a Comment

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu