Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Richard Wurmbrand life history in telugu

Richard Wurmbrand (రిచర్డ్ వుర్మ్ బ్రాండ్) (1909-2001):
   అనేక శ్రమలను భరించి క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి రొమేనియా దేశానికి చెందిన "రిచర్డ్ వుర్మ్ బ్రాండ్".
   రిచర్డ్ 1909వ సంవత్సరంలో మార్చి 24న రొమేనియా దేశంలోని "బుకారెస్ట్"లో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు.రిచర్డ్ తన సహోదరులలో 4వ వాడు మరియు చిన్నవాడు. రిచర్డ్  కొంతకాలం తన కుటుంబముతో కలిసి "ఇస్తాంబుల్"లో నివసించారు. రిచర్డ్ 9ఏళ్ళ వయసులో తండ్రి మరణించాడు.రిచర్డ్ కు 15ఏళ్ళ వయసుండగా వారు తిరిగి రొమేనియా దేశానికి వచ్చారు.
   రిచర్డ్ కు "సబీనా ఓస్టర్"తో 1936లో అక్టోబర్ 26వ తేది వివాహమైనది.

రొమేనియా దేశానికి చెందిన "క్రిస్టియన్ ఓల్ఫ్క్్స" అనే ఒక క్రైస్తవ వడ్రంగి సాక్ష్యం రిచర్డ్ దంపతులు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి తోడ్పడింది.
  ఒకసారి క్రైస్తవ నాయకులు కలిసి జరిగిన సమావేశంలో సంఘములను అణిచివేస్తు దేవుని త్రుణీకరించి చేసే ప్రభుత్వ పాలనను వ్యతిరేఖిస్తూ మాట్లాడిన విధానం రిచర్డ్ దైర్యానికి ప్రతీకగా ప్రజల హ్రుదయాలలో నిలిచిపోయింది.

   1948లో ఫిబ్రవరి 29వ తేది రిచర్డ్ ని ఒక కారులో నలుగురు వ్యక్తులు బందించి తీసుకొని వెళ్ళారు.

అనేక విధాలుగా హింసించారు.కానీ అవేవీ రిచర్డ్ విశ్వాసాన్ని మార్చలేకపోయాయి.


పలు శ్రమల మద్యలో క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి "రిచర్డ్ వుర్మ్ బ్రాండ్".

   రిచర్డ్ 18కి పైగా పుస్తకాలు "టార్చర్డ్ ఫర్ క్రైస్ట్" పేరుతో తన జీవితంలో ఎదురైన అనుభవాలతో రచించాడు.

   రిచర్డ్ దంపతులు ప్రపంచంలో క్రీస్తు కొరకు శ్రమలను ఎదుర్కొనే వారికి సహాయం అందించడానికి "వాయిస్ ఆఫ్ మార్టిర్స్" అనే సంస్థను స్థాపించారు.

   రిచర్డ్ 2001లో ఫిబ్రవరి 17న ప్రభువునందు నిద్రించారు. 2006లో జరిగిన ఒక విశ్లేషణలో రొమేనియా దేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తిగా ప్రజలచే ఎన్నుకోబడ్డారు.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu