Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసైటీ ఆఫ్ జీసస్" మిషనరీలను పంపడానికి ఏర్పా

Hannah Marshman life history in telugu

Hannah Marshman (హన్నా మార్ష్ మాన్) (1767-1847)
      హన్నా మొట్టమొదటి గా భారతదేశానికి వచ్చిన స్త్రీ మిషనరీగా భావించబడుతుంది.
   ఆమె 1767లో మే నెల 13న జన్మించింది.ఆమె తండ్రి జాన్ షెఫర్డ్. మరియు ఆమె తల్లి పేరు రేచల్.హన్నా 8సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయింది.1791లో హన్నాకు  జాషువా మార్ష్ మాన్ తో వివాహం జరిగింది.

    1799లో మే 29న ఆమె, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి భారతదేశం వెళ్ళడానికి ఒక ఓడలో తమ ప్రయాణం ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌక దాడులు చేసే ప్రమాదం ఉన్నా హన్నా కుటుంబంతో పాటు సురక్షితంగా సెరంపోర్ యొక్క డానిష్ సెట్లిమెంట్ వద్ద ఓడ దిగారు. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీలకు విరోధంగా ఉండడం వలన హన్నా ఈ ప్రాంతానికి వచ్చింది. ఆ కుటుంబం డానిష్ కాలనీలో స్థిరపడింది. 1800లో జనవరి 10న హన్నా కుటుంబం విలియం కేరీతో  కలిశారు.

    1800లో మే 1న జాషువా మరియు హన్నా మార్ష్ మాన్ సెరంపోర్ లో రెండు బోర్డింగ్ పాఠశాలలు ప్రారంభించారు.హన్నా స్థానికంగా ఉండే ఆడపిల్లల కొరకు పాఠశాలను ఏర్పాటు చేసింది.
జాషువా మార్ష్ మాన్ ,విలియం కేరీ మరియు విలియం వార్డ్ కలిసి స్థాపించిన సెరంపోర్ కళాశాల నేటి వరకు నిలిచి ఉంది.

హన్నా మార్ష్ మాన్ 1847లో మార్చి 5న 80 సంత్సరాల వయసులో ప్రభువు సన్నిధికి చేరుకుంది.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu