Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Harriet Tubman life history in telugu




 Harriet Tubman (హార్రీట్ టబ్మాన్) (1822-1913)
Harriet Tubman: Moses, the hero of underground rail road.
హార్రీట్ టబ్మాన్ నల్లజాతి వనిత.ఆమె అసలు పేరు అర్మింటా రాస్.ఆమె తల్లిదండ్రులు హార్రిట్ గ్రీన్ రాస్ మరియు బెన్ రాస్.  దక్షిణ అమెరికాలో బానిసకుటుంబంలో 1822లో మేరీలాండ్ లో ఒక బానిస కుటుంబంలో పుట్టింది.టబ్మాన్ బాల్యం నుండి వేరు వేరు యజమానుల చేత బాదింబడుతు బాధ అనుభవిస్తూ పెరిగింది. జీవితంలోని తొలి దినాల్లో తల మీద బాదాకరమైన గాయంతో బాదపడేది. ఒకసారి ఒక బానిస యజమాని బరువైన లోహం విసిరితే అది గురి తప్పి టబ్మాన్ తల మీద తగిలింది. క్రీస్తును అనుసరిస్తు ఉండే టబ్మాన్ కు దర్శనాలు మరియు కలలు కలిగేవి.ఆమె వాటిని దేవుడు తనకు తెలియజేసిన సూచనలుగా పరిగణించింది.


       చదువు లేని టబ్మాన్ కు తన తల్లి బైబిల్ లోని సత్యాలను తెలియజేయుట ద్వారా దేవునిపట్ల విశ్వాసాన్ని కలిగి జీవించింది. ఆ విశ్వాసమే తన జీవితంలో తోడుగా ఉండి బానిసత్వం నుండి తాను విడుదల పొందటమే కాక క్రీస్తును కల్గిన మనసుతో అనేక మంది ఇతరులను బానిసత్వం నుండి విడిపించింది.
    సుమారుగా 1844 లో జాన్ టబ్మాన్ తో  వివాహం జరిగింది. వివాహమైన తరువాత తన పేరు అర్మింటా నుండి హార్రిట్ గా మార్చుకుంది.
        దారుణ బానిసత్వం నుంచి తాను విముక్తి పొందటమేకాక 70కుటుంబాల వారిని అత్యంత సాహసంతో విముక్తి  చేసిన వీరవనిత.మానవహక్కుల కోసం,స్త్రీల హక్కులకోసం జీవితమంతా పోరాడింది.
    విలియం గారిసెన్ అనే వ్యక్తి టబ్మాన్ కు మోసెస్ అనే మారుపేరు పెట్టాడు. హెబ్రీయులను బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు ఉపయోగించుకున్న మోషే అనే వ్యక్తిని ఉద్దేశించి టబ్మాన్ కు ఆ పేరు పెట్టారు. టబ్మాన్ విడిపించినవారిని తీసుకెళ్ళినప్పుడు "గో డౌన్ మోసెస్" అనే పాట పాడేది. ఆ పాట యొక్క పాడే విదానం మార్చుట ద్వారా ముందుకు వెళ్ళడం మంచిదో కాదో తెలియజేసేది. అండర్ గ్రౌండ్ రైల్ రోడ్ ద్వారా అనేకమందిని స్వతంత్రులుగా చేసింది.

ఈమె చిత్రాన్ని అమెరికా ప్రభుత్వం 20డాలర్ల నోటు మీద ముద్రించనున్నది.అమెరికా ప్రభుత్వం కరెన్సీ మీద నల్లజాతివారి చిత్రం ముద్రించటం ఇదే ప్రథమం. 6లక్షలమంది ఈమె చిత్రముద్రణకు అనుకూలంగా ఓటు చేశారు.
ఈ కొత్త కరెన్సీనోటు 2020 లో చలామనిలోకి వస్తుంది. అమెరికా మహిళలకు ఓటు హక్కు వచ్చి 2020 నాటికి 100 ఏండ్లు నిండటం విశేషం.90 ఏండ్లకు పైగా జీవించి 1913 లో మార్చి 10న  ప్రభువు సన్నిధికి చేరుకుంది.


Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu