Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Patrick Hamilton life history in telugu


Patrick Hamilton ( ప్యాట్రిక్ హామిల్టన్)

ప్యాట్రిక్ హామిల్టన్ గారు స్కాట్లాండ్ దేశపు హతసాక్షి
జననం : 1504
మరణం: 29 ఫిబ్రవరి 1528

ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆస్తిపరులు. వారికి ఉన్న సంపదను బట్టి  విట్టన్ బర్గ్ మరియు మార్ బర్గ్ వంటి పెద్ద విశ్వవిద్యాలయం లో చదివాడు.అక్కడే మార్టిన్ లూథర్ మరియు ఫిలిప్ మరియు ఫ్రాన్సిస్ లాంబర్ట్ కు సన్నిహిత సంబంధం కలిగిన వాడాయెను. ఆ సమయంలో వీరు ప్రొటెస్టెంట్ ఉద్యమకారులు. వీరి యొక్క బోధనలకు హామిల్టన్ ఆకర్షితుడయ్యెను.

క్రీస్తు యొక్క నిజమైన బోధలు
క్రీస్తు యొక్క నిజమైన మార్గాలు
క్రీస్తు యొక్క నిజమైన సత్యాలు లేఖనములతో స్పష్టంగా చూపించవలెనని కోరికతో స్కాట్లాండ్ దేశమునకు తిరిగి వెళ్లెను.
తన యొక్క ముఖ్యమైన స్నేహితులుతో ఈ విషయాలు పంచుకొని బోధించటం మొదలుపెట్టారు.

హామిల్టన్ ఈ విధంగా బోధిస్తున్నాడని తెలుసుకొనిన అప్పటి బిషప్ జేమ్స్ బీటెన్ తన యెదుట విచారణకు హాజరు కావలెను అని అతనిని ఆదేశించిరి. అయితే ప్రభువు గురించి చెప్పుటకు ఇది మంచి అవకాశమని హామిల్టన్ వెళ్లెను.కొంత సమయం విచారించి హామిల్టన్ మీద అనేకమైన  నేరములు మోపిరి.

చివరికి ఇతను ఎంత మాత్రము తన బోధనలు తిరిగి తీసుకొనడని అతనికి మరణ శిక్షను విధించిరి.
ఉరికంబము దగ్గరికి హామిల్టన్ ను తీసుకువచ్చినపుడు హామిల్టన్ మోకాళ్ల పై ఉండి కొద్దిసేపు ప్రార్దించెను. ఆ తరువాత అతనిని కట్టి ఒక స్తంభముకు ఉంచిరి.చుట్టూ కట్టెలు అమర్చి అతని చేతుల క్రింద గన్ పొడి ఉంచిరి.
ఉంచి నిప్పు అంటించిరి కొంత మేరకు చేతులు ముఖము కాలెను.అది సరిగా పేలకపోయె సరికి ఇంకా ఎక్కువ గన్ పొడి ఉంచిరి. అప్పుడు హామిల్టన్ మంటలలో కాలెను. అవి తడి కట్టెలు అయినందున నెమ్మదిగా మండెను.

ఆ మంటలలో  మండుతునప్పుడు హామిల్టన్ చివరిగా ఈ మాటలు చెప్పెను
"" యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో
    ఎంత కాలం ఈ రాజ్యము ను చీకటి ఆవరించును
    ఈ మనుష్యుల క్రూరత్వము ఎంత వరకు నీవు
    అనుమతించెదవు.
అని మంటల్లో మండుతూ చనిపోయెను.అతని మరణము అనేక మంది హృదయాలను వెలిగించింది.
సహోదరుడు పాట్రిక్ హామిల్టన్ కేవలం 24 సంవత్సరాల సమయం భూమి మీద జీవించెను కానీ ప్రభు యొక్క గొప్ప సువార్త ప్రకటించెను.

Comments

Popular posts from this blog

acharya RRK Murthy gaari life history in telugu

John Wesley life history in telugu

George Muller life history in telugu