Robert Jermain Thomas (రాబర్ట్ జెర్మియన్ థామస్) (1839-1866)
ప్రభు కొరకు కొరియా లో హతసాక్షి ఆయెను. 1839 లో వేల్స్ నందు జన్మించెను.పూర్తి పేరు రాబర్ట్ జెర్మియన్ థామస్. లండన్ మిషనరీ సోసైటీ తో కలిసి పనిచేశాడు.సహోదరుని హృదయం ఎప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెప్పుటకు మరియు ప్రభుని నమ్మిన వారిని చూచుటకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు.
కరోలినాతో వివాహము జరిగింది,వివాహము జరిగిన పిమ్మట చైనాలో నివసించుటకు వెళ్లెను. చైనా వెళ్లిన కొంత కాలానికే కరోలినా షాంగై లో మరణించెను. సహోదరుడు అదే సంవత్సరంలో బీజింగ్ లో ఇంగ్లీష్ మరియు చైనీస్ బోధించుటకు వెళ్లెను. ఆ సమయంలో కొరియా లో భయంకరమైన హెర్మిట్ కింగ్డమ్ పరిపాలన కొనసాగుతుంది.
1865 లో రాబర్ట్ కొరియాకి చెందిన ఇద్దరు వర్తకులను కలిసాడు.వారు కొరియాలో ఉన్న పరిస్థితులు మరియు సువార్త యొక్క అవసరత చెప్పిరి. సువార్త యొక్క అవసరతను సహోదరుడు నిర్లక్ష్యం చేయలేదు. రాబర్ట్ మారు వేషములో కొరియా వెళ్లి 4 నెలల పాటు సువార్త ప్రకటించెను. అక్కడ సువార్త చెప్పినపుడు దొరికిన యెడల చంపుదురు అని తెలిసినా కాని సహోదరుడు అనేక బైబిల్స్ ద్వారా సువార్త చెప్పినాడు.
ఒక సంవత్సరం తరువాత సహోదరుడు రాబర్ట్ మళ్ళీ కొరియా కొన్ని డబ్బాల నిండా బైబిల్ లు తీసుకొని మరల కొరియా బయలుదెరెను. అక్కడ ఒక అమెరికా వర్తక నౌక లో ఆ నౌక యొక్క కెప్టెన్ జనరల్ షెర్మాన్ అను అమెరికా నౌకలో రాబర్ట్ ప్యోంగ్యాంగ్ వరకు ప్రయాణించెను.
ఆ నౌక మీద ఉన్న అనుమానంతో కొరియన్లు ఆ నౌకకు హెచ్చరికలు చేసిరి. ఆ నౌక ఒక ఇసుక దిబ్బకు గుద్దుకొని ఆగిపోయింది. కొరియన్లు ఆ నౌకకు నిప్పు అంటించారు. అందులో ఉన్న ప్రయాణికులు అందరూ తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అప్పుడు రాబర్ట్ తగలబడుతన్న నౌక యొక్క ఒక అంచున నిలబడి బైబిల్ డబ్బాలు విప్పి ఆ బైబిల్ లను ఆ ఒడ్డున ఉన్న వారికి విసిరివేసెను.
ఇంతలో మంటలు తన వస్త్రములను అంటుకొనెను. నీటిలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు. తన యొద్ద ఉన్న ఆఖరి బైబిల్ కొరియన్ సైనికుడుకు తీసుకోమని బ్రతిమిలాడగా అతను అనుమానించి రాబర్ట్ ను తన యొద్ద ఉన్న ఈటెతో చంపెను. చంపబడే ముందు రాబర్ట్ వారి భాషలో యేసు యేసు అని చెప్పెను.
బైబిల్ లు తీసుకున్న వారిలో కొందరు వాటి గూర్చి పూర్తిగా తెలియక వాటిని ఇంటి గోడలకు అతికించుకున్నారు. తరువాత మెల్లిగా వాటిని చదివి అర్థం చేసుకుని అనేక మంది క్రీస్తు మీద విశ్వాసం ఉంచిరి.
రాబర్ట్ మరణించిన తరువాత ఇంచుమించు 25 సంవత్సరాల అనంతరం ఒక అమెరికాకు చెందిన వ్యక్తి ఆ ఇంటికి అంటించిన కాగితములు చూసేను వాటి మీద ఉన్న పేజీ నెంబర్ కొరియాలో ముద్రణా చూసి ఆ విషయం అడిగెను. రాబర్ట్ ఇక్కడ చంపబడెను అని చెప్పెను.
రాబర్ట్ మరణించిన తేదీ ఆగస్ట్ 31,1866.
ఈ రోజు కొరియా లో సంఘాలు స్థాపించబడెను అంటే అది రాబర్ట్ యొక్క కృషి ఎంతో ఉంది.
కొరియా కె వెళ్లిన రెండవ మిషినరి.
రాబర్ట్ ను చంపిన సైనికుడు తన కుటుంబము తో ఈ రీతిగా చెప్పెను. " నేను ఒక మంచి వ్యక్తిని చంపివేశాను అని."
Comments
Post a Comment