William Colgate- విలియం కాల్గేట్ (1783-1857)
విలియం కాల్గేట్ ఈ పేరు వినగానే సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతిదేశంలోను,ప్రతిరాష్ట్రంలోను,ప్రతిజిల్లాలోను,ప్రతిగ్రామంలోను ఇతను తయారు చేసిన "కాల్గేట్"టూత్ పేస్ట్ వాడని వారుండరు.
విలియంకాల్గేట్ తండ్రిపేరు రాబర్ట్ కాల్గేట్.ఇతను వృత్తిరీత్య వ్యవసాయ దారుడు.రాబర్ట్ కాల్గేట్ చాల తెలివైనవాడు.రాబర్ట్ కాల్గేట్ బార్యపేరు శారా.వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులలో ఒకడు విలియం కాల్గేట్.క్రీ"శ 1783సం"జనవరి25న జన్మించాడు.వీరి కుటుంబం అతి పేదస్థితిలో ఉండేది.
క్రీ"శ"1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వచ్చి హార్ ఫోర్డ్ వచ్చి స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ స్వంత వ్యాపారం చేయాలని 19 వ ఏట నిర్ణయించుకొన్నాడు.
ప్రారంభంలో సోప్స్,క్యాండిల్స్ వ్యాపారము చేశాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది.
తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించి,కొన్ని సూచనలు తెలియ జేశాడు.అతడు చెప్పినవి 1) అన్నిటిలో "ప్రధమస్థానం" ప్రభువుకిమ్మన్నాడు.2)నీ " హృదయాన్ని" ఆయనకిమ్మన్నాడు 3)ప్రతిరోజు ఆయన "చిత్తము" కొరకు ప్రార్థించమన్నాడు.4)నీవు చేసే ప్రతిపనిలో "దశమబాగం"దేవుని కిమ్మన్నాడు.ఆదికాండము28:20-22వరకు చెప్పబడిన దేవునివాక్యము చదివించాడు.
తాను వ్యాపారము మరల ప్రారంభించాడు.నావికుడు ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించాడు.చాల పేరు గాంచిన సువార్తికుడు"మేసన్"గారి ప్రసంగాల ద్వారా ఆత్మీయంగా బలపడ్డాడు.ఎంత వొత్తిడి ఉన్నా ప్రార్థన,వాక్యపఠనం,మరిచినవాడు కాదు.వ్యాపారము ప్రారంభించిన 6 సంవత్సరాల కాలంలోనే వ్యాపారము ఎంతో అభివృద్ది అయినది.న్యూయార్క్ నగరంలోనే విజయవంతమైన వ్యాపారవేత్త గా పేరుతెచ్చుకున్నాడు. తన వ్యపారము అదికమయిన కొలది"దశమభగం" నుండి 20శాతం పెంచాడడు.ఆతర్వాత 30శాతంగా మార్చాడు.కంపెని ఇంకా పైపైకి ఎదగసాగింది.దేవునికి ఎంత ఎక్కువిస్తే అంత వ్యపారము అభివ్రుద్ది చెందసాగింది.తాను దేవునితొ చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చల్లించికొలది దేవుడు అతని వ్యపారాన్ని ఓ సామ్రాజ్యాంగా మార్చినాడు.తుదకు ఇంకా వర్థిల్లుచుండగా అతనికి వచ్చే లాభాల్లో 90 శాతం దేవునికి ఇచ్చి10శాతం మాత్రమే తనకు ఉంచుకొనెవాడు.
విలియం కాల్గేట్ "అమెరికన్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటి" స్థాపించడానికి కృషి చేశారు.అనేక విశ్వవిద్యాలయాలు స్థాపించాడు.వేదాంత కళాశాలలను ప్రాత్సహించారు.ఇతన్ని అందరూ "డీకన్ కాల్గేట్"అనేవారు.వ్యక్తిగతంగా, కుటుంబంలో నిజాయితీగా బ్రతికేవాడు.
ఈయన కనిపెట్టిన వస్తువులు టూత్ పేస్ట్,షేవింగ్ క్రీమ్స్,సోప్స్,ప్రంపంచమంతా ప్రజాదరణ పొందినవి. ఈయన స్థాపించిన"మేడిడన్"కాలేజి ఈయన మరణానంతరం కాల్గేట్ విశ్వవిద్యాలయంగా మారింది. ఇందులో చదువుతున్న పేద విద్యార్థుల జీవితాలలో ఎన్నో వెలుగులు నింపుతున్నది.
మనము దేవునికొరకు ఇవ్వవలసివి.
*మన హృదయం
*నీ రాబడి అంతటిలో బాగం.(సామె3:9)
*దశమబాగం(ఆది28:22.మలాకి3:10)
వెదజల్లి అభివృద్దిలోకి వచ్చినవారు కలరు.దానికి విలియం కాల్గేటే ఒక మంచి ఉదాహరణ.(సామె11:24)
విలియం కాల్గేట్ 1857లో మార్చి 25న న్యూయార్క్ నగరంలో ఉండగా ప్రభువు సన్నిధికి చేరుకున్నారు.
Super
ReplyDelete