Posts

Showing posts from March, 2018

Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

William Colgate life history in telugu

Image
William Colgate- విలియం కాల్గేట్ (1783-1857) విలియం కాల్గేట్ ఈ పేరు వినగానే  సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతిదేశంలోను,ప్రతిరాష్ట్రంలోను,ప్రతిజిల్లాలోను,ప్రతిగ్రామంలోను ఇతను తయారు చేసిన "కాల్గేట్"టూత్ పేస్ట్ వాడని వారుండరు. విలియంకాల్గేట్ తండ్రిపేరు రాబర్ట్ కాల్గేట్.ఇతను వృత్తిరీత్య వ్యవసాయ దారుడు.రాబర్ట్ కాల్గేట్ చాల తెలివైనవాడు.రాబర్ట్ కాల్గేట్ బార్యపేరు శారా.వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులలో ఒకడు విలియం కాల్గేట్.క్రీ"శ 1783సం"జనవరి25న జన్మించాడు.వీరి కుటుంబం అతి పేదస్థితిలో ఉండేది.      క్రీ"శ"1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు వచ్చి హార్ ఫోర్డ్ వచ్చి స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ స్వంత వ్యాపారం చేయాలని 19 వ ఏట నిర్ణయించుకొన్నాడు. ప్రారంభంలో సోప్స్,క్యాండిల్స్ వ్యాపారము చేశాడు. కొన్ని సంవత్సరాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది.     తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించి,కొన్ని సూచనలు తెలియ జేశాడు.అతడు చెప్పినవి 1) అన్నిటిలో "ప్రధమస్థానం" ప్రభువుకిమ...

James Hepburn life history in telugu

Image
James Hepburn -జేమ్స్ హెప్బర్న్ (1815-1911) మార్చ్ 13, 1815 న  పెన్సిల్వేనియాలోని మిల్టన్ లో హెప్బర్న్ జన్మించాడు.పూర్తి పేరు జేమ్స్ కుర్టిస్ హెప్బర్న్. చైనా జపాన్ దేశాలలో వైద్యసేవలు అందించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.హెప్బర్న్ అమెరికా దేశానికి చెందిన వ్యక్తి.       అతను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు, ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో 1836లో M.D. డిగ్రీ పొందారు. హెప్బర్న్ క్రైస్తవ మిషనరీగా చైనాకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కానీ ఓపియం యుద్దం జరుగుతుండడంతో చైనా పోర్టులన్నీ విదేశీయులను నిరాకరించాయి. అందువలన హెప్బర్న్ 2 సంవత్సరాలు సింగపూర్ లో  ఉండవలసి వచ్చింది. మిషనరీగా ఐదు సంవత్సరాలు గడిపిన తరువాత, అతను యునైటెడ్ స్టేట్స్కు 1845లో తిరిగి వచ్చాడు. హెప్బర్న్  బైబిల్ ను జపనీస్ బాషలో అనువదించడానికి కృషి చేశాడు.1859లో హెప్బర్న్ అమెరికన్ ప్రెస్బిటేరియన్ మిషన్ తో జపాన్ కు మిషనరీగా వెళ్ళాడు. హెప్బర్న్ యొకొహమా అనే నగరంలో చేసిన వైద్య సేవలకు యొకొహమా యూనివర్శిటీ వైద్య పాఠశాల ప్రాంగణంలోని పెద్దగదికి హెప్బర్న్ హాల్ అని పేరు ప...

Patrick Hamilton life history in telugu

Image
Patrick Hamilton ( ప్యాట్రిక్ హామిల్టన్) ప్యాట్రిక్ హామిల్టన్ గారు స్కాట్లాండ్ దేశపు హతసాక్షి జననం : 1504 మరణం: 29 ఫిబ్రవరి 1528 ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు ఆస్తిపరులు. వారికి ఉన్న సంపదను బట్టి  విట్టన్ బర్గ్ మరియు మార్ బర్గ్ వంటి పెద్ద విశ్వవిద్యాలయం లో చదివాడు.అక్కడే మార్టిన్ లూథర్ మరియు ఫిలిప్ మరియు ఫ్రాన్సిస్ లాంబర్ట్ కు సన్నిహిత సంబంధం కలిగిన వాడాయెను. ఆ సమయంలో వీరు ప్రొటెస్టెంట్ ఉద్యమకారులు. వీరి యొక్క బోధనలకు హామిల్టన్ ఆకర్షితుడయ్యెను. క్రీస్తు యొక్క నిజమైన బోధలు క్రీస్తు యొక్క నిజమైన మార్గాలు క్రీస్తు యొక్క నిజమైన సత్యాలు లేఖనములతో స్పష్టంగా చూపించవలెనని కోరికతో స్కాట్లాండ్ దేశమునకు తిరిగి వెళ్లెను. తన యొక్క ముఖ్యమైన స్నేహితులుతో ఈ విషయాలు పంచుకొని బోధించటం మొదలుపెట్టారు. హామిల్టన్ ఈ విధంగా బోధిస్తున్నాడని తెలుసుకొనిన అప్పటి బిషప్ జేమ్స్ బీటెన్ తన యెదుట విచారణకు హాజరు కావలెను అని అతనిని ఆదేశించిరి. అయితే ప్రభువు గురించి చెప్పుటకు ఇది మంచి అవకాశమని హామిల్టన్ వెళ్లెను.కొంత సమయం విచారించి హామిల్టన్ మీద అనేకమైన  నేరములు మోపిరి. చివర...

George Muller life history in telugu

Image
George Muller (జార్జ్ ముల్లర్) (1805-1898)     జార్జ్ ముల్లర్ పూర్తి పేరు జోహన్ జార్జ్ ఫెర్డినాండ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1805లో సెప్టెంబర్ 27న జన్మించారు. తండ్రి పేరు ఫ్రెడ్రిచ్ ముల్లర్. తల్లి పేరు సోఫీ ఎలియొనోర్ ముల్లర్.   1829లో ముల్లర్ గారు లండన్ సొసైటీ ద్వారా ఇంగ్లాండ్ లోని యూదుల మద్య పరిచర్య చేయడానికి నిశ్చయించుకున్నారు. అదే సంవత్సరం మార్చి 19న లండన్ చేరుకున్నారు. మే నెల మద్య నాటికి అనారోగ్యం వచ్చి ,జీవించలేననుకున్నారు. తిరిగి తేరుకునేందుకు టెయిన్మౌత్ కు పంపబడ్డాడు. అక్కడే తన జీవితమంతా తనకు స్నేహితుడుగా ఉన్న హెన్రీ క్రైక్ తో పరిచయం ఏర్పడింది. సెప్టెంబర్ లో లండన్ కు తిరిగి వచ్చాడు. కానీ పది రోజులకే మళ్ళీ అస్వస్థత చెందారు. నవంబర్ చివరికల్లా లండన్ సొసైటీ తనకు సరైన ప్రదేశం కాదనే సందేహం వచ్చింది. డిసెంబర్ 12 సొసైటీ నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఒక నెల తరువాత సొసైటీకి "దేవుడు నన్ను నడిపించిన స్థలంలో మరియు సమయంలో నేను శ్రమపడతాను." అని తన ఉద్దేశాన్ని తెలియజేశాడు. కానీ లండన్ సొసైటీ వారు దానికి అంగీకరించలేదు. అప్పుడు లండన్ సొసైటీతో తనకున్న సంబంధం ముగిం...

Harriet Tubman life history in telugu

Image
 Harriet Tubman (హార్రీట్ టబ్మాన్) (1822-1913) Harriet Tubman: Moses, the hero of underground rail road. హార్రీట్ టబ్మాన్ నల్లజాతి వనిత.ఆమె అసలు పేరు అర్మింటా రాస్.ఆమె తల్లిదండ్రులు హార్రిట్ గ్రీన్ రాస్ మరియు బెన్ రాస్.  దక్షిణ అమెరికాలో బానిసకుటుంబంలో 1822లో మేరీలాండ్ లో ఒక బానిస కుటుంబంలో పుట్టింది.టబ్మాన్ బాల్యం నుండి వేరు వేరు యజమానుల చేత బాదింబడుతు బాధ అనుభవిస్తూ పెరిగింది. జీవితంలోని తొలి దినాల్లో తల మీద బాదాకరమైన గాయంతో బాదపడేది. ఒకసారి ఒక బానిస యజమాని బరువైన లోహం విసిరితే అది గురి తప్పి టబ్మాన్ తల మీద తగిలింది. క్రీస్తును అనుసరిస్తు ఉండే టబ్మాన్ కు దర్శనాలు మరియు కలలు కలిగేవి.ఆమె వాటిని దేవుడు తనకు తెలియజేసిన సూచనలుగా పరిగణించింది.        చదువు లేని టబ్మాన్ కు తన తల్లి బైబిల్ లోని సత్యాలను తెలియజేయుట ద్వారా దేవునిపట్ల విశ్వాసాన్ని కలిగి జీవించింది. ఆ విశ్వాసమే తన జీవితంలో తోడుగా ఉండి బానిసత్వం నుండి తాను విడుదల పొందటమే కాక క్రీస్తును కల్గిన మనసుతో అనేక మంది ఇతరులను బానిసత్వం నుండి విడిపించింది.     సుమారుగా 1844 లో జాన్...

Hannah Marshman life history in telugu

Image
Hannah Marshman (హన్నా మార్ష్ మాన్) (1767-1847)       హన్నా మొట్టమొదటి గా భారతదేశానికి వచ్చిన స్త్రీ మిషనరీగా భావించబడుతుంది.    ఆమె 1767లో మే నెల 13న జన్మించింది.ఆమె తండ్రి జాన్ షెఫర్డ్. మరియు ఆమె తల్లి పేరు రేచల్.హన్నా 8సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయింది.1791లో హన్నాకు  జాషువా మార్ష్ మాన్ తో వివాహం జరిగింది.     1799లో మే 29న ఆమె, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి భారతదేశం వెళ్ళడానికి ఒక ఓడలో తమ ప్రయాణం ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌక దాడులు చేసే ప్రమాదం ఉన్నా హన్నా కుటుంబంతో పాటు సురక్షితంగా సెరంపోర్ యొక్క డానిష్ సెట్లిమెంట్ వద్ద ఓడ దిగారు. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మిషనరీలకు విరోధంగా ఉండడం వలన హన్నా ఈ ప్రాంతానికి వచ్చింది. ఆ కుటుంబం డానిష్ కాలనీలో స్థిరపడింది. 1800లో జనవరి 10న హన్నా కుటుంబం విలియం కేరీతో  కలిశారు.     1800లో మే 1న జాషువా మరియు హన్నా మార్ష్ మాన్ సెరంపోర్ లో రెండు బోర్డింగ్ పాఠశాలలు ప్రారంభించారు.హన్నా స్థానికంగా ఉండే ఆడపిల్లల కొరకు పాఠశాలను ఏర్పాటు చేసింది. జాషువా మార్ష్ మాన్ ,విలియం కేరీ మరియు విలియం ...

Robert Jermain Thomas life history in telugu

Image
  Robert Jermain Thomas (రాబర్ట్  జెర్మియన్ థామస్) (1839-1866) ప్రభు కొరకు కొరియా లో హతసాక్షి ఆయెను. 1839 లో వేల్స్ నందు జన్మించెను.పూర్తి పేరు రాబర్ట్ జెర్మియన్ థామస్. లండన్ మిషనరీ సోసైటీ తో కలిసి పనిచేశాడు.సహోదరుని హృదయం ఎప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త చెప్పుటకు మరియు ప్రభుని నమ్మిన వారిని చూచుటకు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు. కరోలినాతో వివాహము జరిగింది,వివాహము జరిగిన పిమ్మట చైనాలో నివసించుటకు వెళ్లెను. చైనా వెళ్లిన కొంత కాలానికే కరోలినా షాంగై లో మరణించెను. సహోదరుడు అదే సంవత్సరంలో బీజింగ్ లో ఇంగ్లీష్ మరియు చైనీస్ బోధించుటకు వెళ్లెను. ఆ సమయంలో కొరియా లో భయంకరమైన హెర్మిట్ కింగ్డమ్ పరిపాలన కొనసాగుతుంది. 1865 లో రాబర్ట్ కొరియాకి చెందిన ఇద్దరు వర్తకులను కలిసాడు.వారు కొరియాలో ఉన్న పరిస్థితులు మరియు సువార్త యొక్క అవసరత చెప్పిరి. సువార్త యొక్క అవసరతను సహోదరుడు నిర్లక్ష్యం చేయలేదు. రాబర్ట్ మారు వేషములో కొరియా వెళ్లి 4 నెలల పాటు సువార్త ప్రకటించెను. అక్కడ సువార్త చెప్పినపుడు దొరికిన యెడల చంపుదురు అని తెలిసినా కాని సహోదరుడు అనేక బైబిల్స్ ద్వారా సువార్...

John Wesley life history in telugu

Image
John Wesley (జాన్ వెస్లీ) (1703-1791)    "లోకమే నా సేవ స్థలం" అను నినాదం తో క్రీస్తు సువార్తను అనేక దేశాలలో వెదజల్లి అనేక ఆత్మలను క్రీస్తు వైపునకు త్రిప్పి గొప్ప ఉజ్జివాన్ని తీసుకువచ్చిన జాన్ వెస్లీ గారి సేవా జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.   జాన్ వెస్లీ ఇంగ్లాండులో జన్మించిన ఒక గొప్ప దైవసేవకుడు.       ఇతని పుట్టిన రోజు 17 జూన్ 1703. ఇతని తండ్రి పేరు శామ్యూల్ వెస్లీ , తల్లి పేరు సూసన్నా వెస్లీ.ఈ దంపతులకు 19 మంది సంతానం. ఆ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికిరి.      వారిలో జాన్ వెస్లీ  ఒకడు . అప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం జరిగినది. ఈ ప్రమాదంలో వెస్లీ కూడా మరణించాల్సినవాడే. కానీ దేవుడు అతని యెడల గొప్ప ఉద్దేశ్యాలను కలిగియున్నాడు. కనుక ఆయన తన కృపనుబట్టి అతన్ని కాపాడెను. ఈ అగ్ని ప్రమాదం సంభవించినపుడు జాన్ వెస్లీ వయస్సు ఆరు సంవత్సరాలు .        వెస్లీ యొక్క తండ్రి ఒక బోధకుడైయుండెను. తల్లి సూసన్నా వెస్లీ తన బిడ్డలనందరిని వారి చిన్న ప్రాయము నుండే దేవుని భయభక్తుల్లో  పెంచింది.     వెస్లీ తన 15వ ఏటనే విశ్...