Posts

Showing posts from February, 2018

Saint Francis Xavier life history in telugu

Image
Saint Francis Xavier -సెయింట్ ఫ్రాన్సిస్  క్సేవియర్ (1506-1552)     క్సేవియర్ 1506లో ఏప్రియల్ 7న కింగ్డమ్ ఆఫ్ నావెర్ లోని జేవియర్ లో ఒక సంపన్న వ్యవసాయ కుటుంబములో జన్మించారు. బోలోగ్నా విశ్వవిద్యాలయం నుండి Lawలో డాక్టరేట్ సంపాదించారు. క్సేవియర్ 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. 1525లో యునివర్సిటీ ఆఫ్ పారిస్ లో విద్యాభ్యాసానికై క్సేవియర్ పారిస్ చేరుకున్నారు.ఈ యునివర్సిటీలో ప్రారంభ రోజుల్లో మంచి క్రీడాకారునిగా మరియు హై జంపర్ గా గుర్తింపు పొందాడు. ఇగ్నేషియస్ మరియు పియరీ ఫావ్రే అనే ఇద్దరు క్సేవియర్ కు మంచి స్నేహితులుగా ఈ యునివర్సిటీలోనే లభించారు. ఇగ్నేషియస్ ఆలోచనలతో పియరీ బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు గానీ ఈ లోకంలోని అభివృద్ధి గురించే ఆలోచిస్తున్న క్సేవియర్ నిరాకరించాడు. కొంత కాలానికి పియరీ తన కుటుంబాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఇగ్నేషియస్ నెమ్మదిగా క్సేవియర్ ఆలోచనలలో మార్పు తీసుకొనిరాగలిగాడు. ఫ్రాన్సిస్ క్సేవియర్ 1534లో థియాలజీ చదువును ప్రారంభించాడు. సువార్త వ్యాప్తి కోసం కొత్తగా పట్టభద్రులైన విద్యార్దుల ద్వారా "సొసై...

Gladys May Aylward life history in telugu

Image
Gladys May Aylward (గ్లాడిస్ మే ఐల్వార్డ్) (1902-1970)       గ్లాడిస్ 1902వ  సంవత్సరం ఫిబ్రవరి 24న ఎడ్మోన్టన్ లో నార్త్ లండన్ లో  జన్మించింది. ఆమె తండ్రి పేరు థామస్ జాన్ మరియు ఆమె తల్లి పేరు రొసినా ఫ్లోరెన్స్. ఆమె తోబుట్టువులు లారెన్స్ మరియు వైలెట్.    మొదట్లో గ్లాడిస్ స్వదేశంలోనే పనిచేసింది.ఆ తరువాత క్రైస్తవ మిషనరీగా వేరే దేశం వెళ్ళడానికి దేవుడు పిలచిన పిలుపును గ్రహించింది. ఆమెను "చైనా ఇన్లాండ్ మిషన్" 3 నెలల ప్రాథమిక శిక్షణకు అంగీకరించింది.కానీ తరువాత చైనా భాషలో ప్రావీణ్యురాలు కాలేకపోవడం వలన మిగిలిన శిక్షణను ఇవ్వలేదు.      1932లో "సర్ ఫ్రాన్సిస్ ఎంగస్బండ్" కొరకు పనిచేసి తన పొదుపు చేసిన మొత్తాన్ని చైనాలోని "యాంగ్ చెంగ్"కు  ప్రయాణమవ్వడానికి ఖర్చు పెట్టింది.ఈ ప్రయాణంలోని ఎదురైనా అడ్డంకులను దాటి "యాంగ్ చెంగ్"కు చేరింది.        "యాంగ్ చెంగ్" చేరిన తరువాత గ్లాడిస్ అంతకు ముందునుంచి అక్కడ మిషనరీగా పనిచేసే "జీనీ లాసన్"తో కలిసి ప్రయాణికులకు ఆతిథ్యమిస్తు మరోవైపు  యేసుక్రీస్తు సువార్త ప్రకటించింది.   ...

Eric henry Liddell life history in telugu

Image
Eric Henry Liddell (ఎరిక్ హెన్రీ లిడ్డెల్) (1902-1945)    ఎరిక్ 1902లో జనవరి 16న స్కాటిష్ తల్లిదండ్రులకు చైనాలో జన్మించాడు.   1924లో పారిస్ లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ లో  పాల్గొన్నాడు. దేవునికి ఇచ్చిన మాట కోసం ఆదివారం పాల్గొనాల్సిన 100మీటర్ల పరుగు పందెంలో పోటిపడకుండా చర్చికి వెళ్ళాడు.దేవుని కృప చేత స్కాట్లాండ్ అభ్యర్థన మేరకు తనకు అనుభవం లేని 400మీటర్ల పరుగు పందెంలో పోటిపడి బంగారు పతకం సాధించాడు.ఈ పరుగు పందెంలో 47.6సెకన్ల తక్కువ సమయంలో పరుగెత్తి చరిత్రలో క్రొత్త రికార్డు సృష్టించాడు. "ఫ్లైయింగ్ స్కాట్లాండ్" అనే బిరుదు పొందాడు. అతని జీవితం ఆధారంగా రూపొందించిన చారియట్స్ ఆఫ్ ఫైర్ అనే సినిమా ఆస్కార్ అవార్డు గెలిచింది.     ఒలింపిక్ లో  బంగారు పతకం సాదించినందుకు ఏర్పాటు చేసిన సభ నుండి నేరుగా చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు.ధనవంతులైన చైనా విద్యార్థులు చదువుకొనే ఆంగ్లో చైనీస్ కాలెజ్ లో అద్యాపకునిగా తన మిషనరీ పని ప్రారంభమైంది. ఎరిక్ వివాహం 1934లో "ఫ్లోరెన్స్ మెకెంజీ"తో జరిగింది. 1941లో చైనాలో జీవనం జపాన్ దాడుల వల్ల దారుణంగా తయారైంది. ఫ్లోరెన...

Thomas Bilney life history in telugu

Image
Thomas Bilney (థామస్ బిల్నీ) (1495-1531) సహోదరుడు థామస్ బిల్నీ ఒక ఆంగ్ల క్రైస్తవ హతసాక్షి. బిల్నీ నార్ఫోక్ లో 1495 లో జన్మించెను. 1510 లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రవేశించెను. అతనికి ఉన్న పొట్టితనాన్ని బట్టి లిటిల్ బిల్నీ అని పిలిచే వారు.1519 లో L.L.B కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నందు పూర్తి చేసెను. ఈ అకాడమీ విద్యల వలన తృప్తి లేనటువంటి బిల్నీ తన దృష్టిని గ్రీకు భాషలో ఉన్న క్రొత్త నిబంధన వైపు మరల్చినాడు. అలా బిల్నీ క్రొత్త నిబంధన చదువుతునపుడు 1 తిమోతి 1:15 (​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది.) అనే వాక్యము చేత సందించబడ్డాడు.తరువాత ఈ వాక్యము తేనె కంటే ఇష్టమైనది అని బిల్నీ చెప్పెను. బిల్నీ కీ ఈ వాక్యం అన్నిటికంటే ముఖ్యమైనది గాను ఇష్టమైనది గాను ఉన్నది. తన స్నేహితులలో పార్కర్, లాటిమర్,కాంటర్బరీ యొక్క ఆర్చ్ బిషప్ ప్రధానమైన వారు. లాటిమర్ మరియు బిల్నీ ల మధ్య మంచి స్నేహం ఏర్పడెను.బిల్నీ యొక్క రక్షణను చూసి లాటిమర్ ఈ రీతిగా చెప్పెను ""నేను దీనిని 20 సంవత్సరాల క్రితమే తెలు...

Richard Wurmbrand life history in telugu

Image
Richard Wurmbrand (రిచర్డ్ వుర్మ్ బ్రాండ్) (1909-2001):    అనేక శ్రమలను భరించి క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తి రొమేనియా దేశానికి చెందిన "రిచర్డ్ వుర్మ్ బ్రాండ్".    రిచర్డ్ 1909వ సంవత్సరంలో మార్చి 24న రొమేనియా దేశంలోని "బుకారెస్ట్"లో ఒక యూదుల కుటుంబంలో జన్మించారు.రిచర్డ్ తన సహోదరులలో 4వ వాడు మరియు చిన్నవాడు. రిచర్డ్  కొంతకాలం తన కుటుంబముతో కలిసి "ఇస్తాంబుల్"లో నివసించారు. రిచర్డ్ 9ఏళ్ళ వయసులో తండ్రి మరణించాడు.రిచర్డ్ కు 15ఏళ్ళ వయసుండగా వారు తిరిగి రొమేనియా దేశానికి వచ్చారు.    రిచర్డ్ కు "సబీనా ఓస్టర్"తో 1936లో అక్టోబర్ 26వ తేది వివాహమైనది. రొమేనియా దేశానికి చెందిన "క్రిస్టియన్ ఓల్ఫ్క్్స" అనే ఒక క్రైస్తవ వడ్రంగి సాక్ష్యం రిచర్డ్ దంపతులు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి తోడ్పడింది.   ఒకసారి క్రైస్తవ నాయకులు కలిసి జరిగిన సమావేశంలో సంఘములను అణిచివేస్తు దేవుని త్రుణీకరించి చేసే ప్రభుత్వ పాలనను వ్యతిరేఖిస్తూ మాట్లాడిన విధానం రిచర్డ్ దైర్యానికి ప్రతీకగా ప్రజల హ్రుదయాలలో నిలిచిపోయింది.    1948లో ఫిబ్రవరి 29వ తేది రిచ...

John Lambert life history in telugu

Image
జాన్ లాంబర్టు (john Lambert) లాంబర్టు గ్రీకు లాటిన్ భాషలలో ప్రావీణ్యుడు. 1500 ఆ సమయములోనే కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం లో విద్యను అభ్యసించినవాడు. లాటిన్ గ్రీకు బాషలలో నుండి ఇంగ్లీష్ కు తర్జుమా చేసిన వాడు. సహోదరుడు విలియం టీండేల్,జాన్ ఫ్రిత్ వంటి ప్రఖ్యాత హతసాక్షులు తో స్నేహము చేసిన వ్యక్తి. ఇంగ్లాండ్ ఛాన్సుల్లర్ అయిన తామస్ మోర్ క్రీస్తు శిష్యులను హింసించే వాడు. బెల్జియం లో ఉన్న యాంట్ వర్పు లో లాంబర్టు ను పట్టి న్యాయము తీర్చుటకు కాంటర్ బరి లో నున్న ఆర్చ్ బిషప్ దగ్గరకు  తెచ్చిరి. కొంతకాలము తరువాత విమర్శ దినమునందు తీర్పు తీర్చుటకు కూర్చున్న రాజుగారు ధవళ వస్త్రము ధరించి న్యాయము తీర్చుటకు కూర్చుండెను, ఆయన కుడి పక్కన బిషప్ లు కూర్చుండిరి. వారి వెనక వకీలు నీల దూమ్ర వస్త్రము ధరించి కూర్చుండెను. వీరందరూ జాన్ పట్ల అత్యంత కోపము తో ఉండెను. రాజు గారు ముఖము కఠినంగా భయము కలుగనట్లుగా ఉండెను. విచారణ లో ప్రభు రాత్రి భోజనం పట్ల జాన్ యొక్క అభిప్రాయం అడిగెను. రాజు ఈ విధoగా అడిగెను. రొట్టె ద్రాక్ష రసము క్రీస్తు శరీరముగా రక్తం గా మారునా దానికి జాన్ కాదు రాజా అవి క్రీస్తు శరీరమునకు గుర్తు...

Fanny Crosby life history in telugu

Image
*ఫెన్నీ క్రాస్బీ (1820-1915)* ఫెన్నీ క్రాస్బీ న్యూయార్క్ పట్టణం ఆమెరికాలో మార్చి 24వ తేదీన జన్మించింది. 6 వారాల పసికందుగా ఉన్నప్పుడు ఆమెకు అనారోగ్యం వచ్చింది, అప్పుడు వైద్యుని నిర్లక్ష్యాన్ని బట్టి తప్పైన మందును తన కళ్ళళ్ళో వేసినందుకు ఆమె చూపును కోల్పోయింది. 8 నెలల బిడ్డగా ఉన్నప్పుడే తన తండ్రిని కోల్పోయింది. 14 సం" వయస్సులో ఆమెను అంధుల పాఠశాలలో చేర్పించారు. ఫెన్నీ క్రాస్బీ తనకున్న లోపాన్నిబట్టి, తనకున్న కష్టాలనుబట్టి కృంగిపోక, నిరాశచెందక దేవుని స్తుతిస్తూ దేవునియందు ఆనందించేది. దేవుడు ఆమెకు అనుగ్రహించిన సంగీతం, కవిత్వం వంటి తలాంతులు ద్వారా చక్కటి పదజాలంతో దేవుని స్తుతి కీర్తనలు వ్రాసింది. డి.యల్.మూడీ వంటి గొప్ప దైవజనుల సభలలో కూడా ఆమె దేవుని స్తుతి కీర్తనలు పాడేది. ఆమె పాడే పాటల ద్వారా అనేకుల హృదయాలు స్పందించేవి. ఆమె.ఇంచుమించు 9,000 కీర్తనలు వ్రాసినట్టుగా అంచనా వేశారు. అనేక భాషలలో ఆ పాటలు తర్జుమా చేశారు, అనేక దేశాల్లో ఆమె వ్రాసిన పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. ఆమె ఎంతో మందికి ఆశీర్వాదకరముగా జీవించింది. ఫెన్నీ క్రాస్బీ అక్కడితో సంతృప్తి చెందక మురికివాడల్లోనికి, పేద ప...

Mungamuri Devadasu gari life history in telugu

Image
Mungamuri Devadasu ayyagaru (ముంగమూరి దేవదాసు అయ్యగారు) ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840 లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి, 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆద్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకొన్నారు. ఈయన తన జీవితకాలములో సిరిని ముట్టలేదు, పరిశుద్ద బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే యుండి దేవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షముగా చూడడమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల "సూది కొండ" అను ప్రదేశములో ఆ ప్రత్యక్షతను చూపించారు. హిమాలయాలలోని కైలాస మహర్షి, సాదు సుందర్ సింగ్ లాంటి భక్తులతో ఆత్మీయంగా సంభాషించేవారు. జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవ నీతి అను లక్షణములతో నిత్యమూ, సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపర్చిన యేసు క్రీస్తు, మరియు ఇప్పుడు మనలను ఆధరించి, బలపర్చి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ; అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను, శక్తివంతముగా ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని, పెదకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి, దైవ జ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర...

William Carey life history in telugu

Image
William Carey (విలియం కేరి) *ఇంగ్లాండు దేశంలో నార్తంప్టన్ ఒక ప్రముఖ జిల్లా కేంద్రం.ఆ జిల్లాలోనే పాలెర్స్ పరి అనే గ్రామంలో 1761 ఆగష్టు 17వ తేదీన విలియంకేరి ఎడ్మండ్ కేరి,ఎలిజబెత్ దంపతులకు జన్మించాడు. *11 సంవత్సరాల వయస్సుకే  కొలంబస్ మొదటి సముద్ర ప్రయాణములను గూర్చి కేరీ కనుబరిచిన శ్రద్ధను గమనించిన అతని స్నేహితులు అతనిని ఎగతాళిగా జూనియర్ కొలంబస్ అని పిలిచేవారు. *12 సంవత్సరాల వయస్సులోనే మతమునకు,భక్తికి సంబందించిన ప్రతి పుస్తకమును చదివి ముగించాడు.కానీ అవేమీ అతని మీద ప్రభావం చూపలేదు. *6వ సంవత్సరమున విద్య ప్రారంభించిన కేరీ,12 సంవత్సరాల వయస్సుకే విద్యను ముగించవలసి వచ్చింది. *చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ బోధలు తప్ప మరియొక బోధ ఎరుగని విలియంకేరీని జాన్ వెస్లీ బోధలు ఎంతో ప్రభావితం చేశాయి. *తనతో పాటు పనిచేసే 'జాన్ వార్' భక్తి ప్రభావము కేరీ జీవితము మీదనేకాక వారి యజమానుడైన నికొల్స్ గారి మీద కూడా పడినది. *డోరతి,కేరీల వివాహం 1781వ సంవత్సరం జూన్ 10వ తేదీన జరిగింది.ఆమె అతనికంటే వయస్సులో పెద్దది. *విల్లీ తన భార్యను ముద్దుగా డాలీ అని పిలిచేవాడు. *1787లో విలియం తల్లి మరణించింది. *అధిక జ్వరము వలన క...

Yesanna gaari life history in telugu

Image
YESANNA garu (ఏసన్న గారు) జన్మదినం: 19వ తేది మార్చి,1947(in Saint Joseph hospital) తల్లిదండ్రులు: నరసింహులు,కమలమ్మ ప్రభువు నందు నిద్రించిన రోజు:ఆగస్టు 8వ తేది,2012 Song about his testimony:    ఇది జరిగెనే ఏలాగో [2]    విషకోరలలో చిక్కుకుని [2]    నడివీధులలో విలపించెనే పసిప్రాయం [2] 1.కన్నవారి ఆదరణే కడు దూరమాయెనే    నిషిద్ధమైనవే అతిసమీపమాయెనే (2)    అంధకార బంధకాలలో కృంగిపోయెనే [2]    ||ఇది జరిగెనే|| 2.ఆరుబయట పడకలన్ని రక్తసిక్తమాయెనే    మమత మానవతా నిలిచిపోయెనే సుదూరతీరాలలో (2)    సుఖజీవనశైలి శాపమాయెనే [2]    వంచనా వలయాల ఊబిలో [2]    ||ఇది జరిగెనే|| 3.సృష్టికర్త ప్రణాళిక ఇలా ఉండగా    అడ్డుపడిన విరోధికి అపజయాలే మిగిలెనా (2)    తేజోమయుని ప్రత్యక్షతలే [2]    విజయపధమున నడిపించునా [2]    ||ఇది జరిగెనే||

Munganda Santa rao gaari life history in telugu

Image
Evangelist Munganda Santarao garu (సువార్తికుడు ముంగండ శాంతారావు గారు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తముగా మీరు గోడల మీద యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునుగా చేయును అనే వాక్యం చూస్తే వీరు రాసినదే..పాస్టర్.ముంగండ శాంతారావు గారు. వీరు మన ఇండియా అంతటా బైబిల్ వాఖ్యాలు రాసిన దైవజనులు .వీరు కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వేకానూరు గ్రామములో ఉండేవారు.14.1.2017 శనివారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగి రాత్రి ఒంటి గంటకు ప్రభువు సన్నిధికి చేరియున్నారు. ముంగండ శాంతారావు గారు చాలా గొప్ప దైవజనులు. 1 నిముషం కూడా వృధా చెయ్యకుండా, ప్రతీ రూపాయి దగ్గర దేవుని వద్ద నమ్మకస్తునిగా ఆయన దేవుని పనిని జరిగించారు. ఆయన తన ప్రయాసను వదిలి ప్రభువైన యేసు క్రీస్తును హత్తుకొన్నారు. దేవుడు ఆయన పరిచర్యను దీవించును గాక.

AB Masilamani gaari life history in telugu

Image
AB MASILAMANI garu (ఎ.బి. మాసిలామణి గారు) జన్మదినం 30/11/1914 సార్వత్రిక సంఘానికి ముఖ్యంగా తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన సేవ అనిర్వచనీయం. ఒకే సమయంలో పండితులకు పామరులకు అర్ధమయ్యే విధంగా వాక్యాన్ని బోధించడం ఆచార్యుల వారి ప్రత్యేకత. తక్కువ సమయంలో ఎక్కువ వాక్యాలను ఉటంకించి బోధించడంలో ఆయనే మేటి. ఆయన కంఠ స్వరం ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆయన మాటలు మనసుని అల్లుకుపోయె లతలు. క్రీస్తు ప్రేమను సుస్పష్టంగా, సవివరంగా శ్రోతల ఎదుట సునాయాసంగా ప్రదర్శించే ప్రజ్ఞాశాలి. మాసిలామణి గారి "దేవుని ప్రేమ" అనే ప్రసంగంలో నాకు నచ్చిన కొన్ని మాటలు.. “దేవుడు మానవ ప్రేమికుడన్న సత్యాన్ని పటిష్టం చేయడానికే యేసు నామావతారునిగా చరిత్రలో రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు కాలు మోపాడు. ప్రేమ జీవన అనంతపాశం అని క్రీస్తు ప్రభోధించాడు, దివ్య ప్రేమను ఆయన ప్రదర్శించాడు, ఆ ప్రేమ కానుకను లోకానికి ప్రసాదించాడు. శిశువు జన్మించినప్పుడు బొడ్డు కోయుట ద్వారా శిశువునకు ఒక ప్రత్యేకతను ఆపాదించడం మాత్రమే గాకుండా, మాతాశిశువుల అనన్యతకు అంతరాయం కలిగిస్తాము. రక్తబంధాన్ని ఆలా తెంపి వేయగలిగినా, పిండోత్పత్తి మొదలుకొని మాతాశిశువులను పెన...

acharya RRK Murthy gaari life history in telugu

Image
RRK MURTHY garu (ఆర్.ఆర్.కె.మూర్తి గారు) (1928-2011) FROM TESTIMONY OF RRK MURTHY: ఫిబ్రవరి-29 నా జన్మదిన సందర్భంలో మాసిలామణి గారిచ్చిన సందేశం మరిచిపోలేను. పూర్తి పేరు:రాయసం రాధా కృష్ణమూర్తి జన్మదినం:ఫిబ్రవరి-29,1928 నాన్నగారి పేరు: రంగనాయకశర్మ అమ్మగారు:కామేశ్వరమ్మ భార్య పేరు:వరలక్ష్మి అన్నలు:వెంకట సుబ్బారావు,సత్యన్నారాయణ, విశ్వనాథం,కల్యాణ రామ్మూర్తి అక్కలు:లక్ష్మీ దేవమ్మా,శకుంతల మా వూరు గోవిందపురం.గుంటూరు జిల్లా నర్సారావు పేట తాలూకా చిలుకలూరి పేట రోడ్డు ప్రక్కగా ఉన్న కుగ్రామం.పుట్టి పెరిగింది నిష్టాగరిష్టమైన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో. చితికిపోయిన మద్యతరగతి కుటుంబం.రాయసం వారు పూర్వం రాజుల ఆస్థానంలో కవులుగా ఉండేవారు.మేం ఐదుగురు సోదరులం.మా నాన్నగారికి ఐదుగురు సోదరులు.     1955వ సంవత్సరం ఆ రాత్రి నా జీవితంలో మరుపురానిది. అంతరాంతరాలలో చెప్పశక్యం కాని వ్యధ మొదలైంది. క్రీస్తు కోసం శిబిరం వెలుపలికి వెళ్ళి నింద భరించడానికి నా ఆత్మ భయపడుతోంది. గజగజ వణికిపోయాను. నాలోని నవనాడులు కుంగిపోయాయి. పడకలో అటు ఇటూ పొర్లాడాను. అర్థరాత్రి భరించరాని శిరోవేదన మొదలైంది. అలాగే కు...

Purushottam chowdary gaari life history in telugu

Image
Purushottam chowdary (పురుషొత్తం చౌదరి) (1803 – 1890) ఆంధ్రక్రైస్తవ సంకీర్తనా పితామహుడు, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడు అని పిలువబడే కవిశేఖరుడు చౌధరి పురుషోత్తం గారి పేరు వినని, ఆయన పాట గానం చేయని  తెలుగు క్రైస్తవుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. చౌధరి పురుషొత్తం గారు 1803 సెప్టెంబరు 5 వ తేదీన గంజాం జిల్లా మదనాపుర గ్రామంలో జన్మించారు. తల్లి దండ్రులు కూర్మనాథ చౌధరి, సుభద్రా దేవి చౌధ రాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాలు నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. తమ మతాచారాల ప్రకారం పురుషోత్తమ చౌధరి గారికి ఏడు సంవత్సరాలప్పుడే ఉపనయనం (ceremony of sacred thread) జరిపి, గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. పురుషోత్తం చౌధరి గారు బాల్యం నుండే మతనిష్ట కలిగి ఉండేవారు. నిరంతర విగ్రహారాధన, తీర్థయాత్రలతో పాటు భుజాలపై వైష్ణవ మతసూచకాలైన శంఖుచక్రాల్ని కూడ  కాల్పించుకొన్నారు. 1823 లో తన మేనమామ కుమార్తె యైన రాధామణి దేవిని వివాహం చేసికొన్నారు.  సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి, 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయనారంభించాడు. క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుప...